వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్కోటకుడు స్టాట్‌ బరాంగ్‌: యూఎస్‌లో వంశీరెడ్డిని పొట్టనబెట్టుకున్నది ఇతడే...

ఫిబ్రవరి 10న అమెరికా కాలిఫోర్నియాలో వంశీరెడ్డిని కాల్చి చంపిన హంతకుడు కరడుగ్టిన నేరస్తుడిగా అమెరికా పోలీసులు తేల్చారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: ఫిబ్రవరి 10న అమెరికా కాలిఫోర్నియాలో వంశీరెడ్డిని కాల్చి చంపిన హంతకుడు కరడుగ్టిన నేరస్తుడిగా అమెరికా పోలీసులు తేల్చారు. హంతకుడు స్టాట్ బరాంగ్‌ (30) ఫ్రెమ్‌ అనే ప్రాంతానికి చెందిన వాడని గుర్తించారు. ఇతడు గతంలో చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తూ ఇటీవలే పెరోల్‌ మీద జైలు నుంచి విడుదలైనట్లు తెలుస్తోంది. పెరోల్‌ ముగిసినప్పటికీ జైలుకు వెళ్ళకుండా పోలీసులకు దొరకకుండా తిరుగుతూ పలు నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

నేరం జరిగిందిలా...

మిల్‌పిస్‌ పోలీసులు కథనం ప్రకారం... ఫిబ్రవరి 10 రాత్రి 10.45 నిమిషాలకు సౌత్‌ మెయిన్‌ వీధి, గ్ర్‌మాల్‌ పార్క్‌వే సౌత్‌ ఏబుల్‌ వీధి మధ్యలో ఉన్న సమీపంలో మిత్సుబిషి 2002, గాల్‌సీడన్‌ కారులో వేగంతా ఇలారా అపార్ట్‌మెంట్ నుంచి పోలీసులను తప్పించుకుని దూసుకుపోయాడు. అతడు ఒక మహిళతో ఘర్షణపడి గన్‌తో బెదిరించినట్లు అప్పటికే సమాచారం ఉంది. దీంతో పోలీసులు చుట్టుముట్టగానే తుపాకీతో కాల్చిన శబ్దం వినిపించిందని అనంతరం వేగంగా కారులో హంతకుడు స్టాట్ బరాంగ్‌ పోలీసులను తప్పించుకుని దూసుకెళ్ళాడు.

<strong> అమెరికాలో వరంగల్ విద్యార్థి కాల్చివేత, కారు ఎత్తుకెళ్లారు: పేరెంట్స్ కన్నీరు</strong> అమెరికాలో వరంగల్ విద్యార్థి కాల్చివేత, కారు ఎత్తుకెళ్లారు: పేరెంట్స్ కన్నీరు

Man accused of killing Telangana techie in US arrested

పోలీసులు సైతం వెంబడించడంతో హడావిడిగా మరో కారును ఢీకొని హంతకుండి కారు ఆగిపోయింది. దీంతో స్టాట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇలారా అపార్ట్‌మెంట్ స్థలాన్ని పోలీసులు పరిశీలించడంతో వంశీరెడ్డి అప్పటిటికే ప్రాణాలు వదిలినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

స్వస్థలానికి మృతదేహం

మామిడాల వంశీరెడ్డి మృతదేహం శుక్రవారం వరంగల్‌కు చేరనుంది. పోలీసుల విచారణ అనంతరం మృతదేహాన్ని అప్పగించేందుకు అక్కడి అధికారులు అంగీకరించారు. భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులతోపాటు అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళు వంశీ మృతదేహం తరలించేందుకు తీవ్రంగా కృషి చేశారు. దీంతో ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్‌కు శుక్రవారం ఉదయం 2.45 నిమిషాలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి వరంగల్‌లోని వంశీ స్వస్థలం వంగపహాడ్‌కు చేరుస్తారు.

English summary
A man responsible for the killing of a 26-year-old Indian man in Santa Clara County of California last week has been arrested, external affairs minister Sushma Swaraj said on Monday and assured all assistance to the family of the deceased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X