హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి: సినీ ఫక్కీలో అడ్డుకున్న పోలీసులు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

భార్య బ్రతికుండగానే రెండో పెళ్లికి సిద్ధమైన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన లింబగిరి కొడుకు కిరణ్‌వర్మ తన మేనత్త కుమార్తె అయిన మంజులను 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు.

వరుసకు బావ అయిన కిరణ్‌వర్మతో కుటుంబ సభ్యులతో తెలియకుండా 2004లో విజయవాడకు వెళ్లి వివాహం చేసుకున్నారు. మంజులకు అంతకు ముందే వినోద్ అనే వ్యక్తితో వివాహం జరిగి, కుటుంబ కలహాల వలన అతనితో విడాకులు తీసుకొని ఘట్‌కేసర్ మండలం రామపల్లి గ్రామంలోని తల్లిగారింట్లో ఉండేది.

పెళ్లి అనంతరం హైదరాబాద్‌లోని ఈసీఎల్ ఆర్‌సీనగర్‌లో నివాసం ఉండేవారు. కిరణ్‌వర్మ తరచూ తాగి మంజులను కొడుతూ గొడవకు దిగేవాడు. కాగా కిరణ్‌వర్మ తన కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నెల తాండూరులోని పాత తాండూరుకు చెందిన ఓ యువతితో పెళ్లి చేసుకునేందుకు రూ. లక్ష, నాలుగు తులాల బంగారం కట్నంగా మాట్లాడుకుని వివాహం నిశ్చయించుకున్నారు.

భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి, కేసు నమోదు

భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి, కేసు నమోదు

కిరణ్‌వర్మ పెళ్లి పత్రికలను తమ బంధువులకు ఇస్తుండగా సమాచారం తెలుసుకున్న మంజుల అన్న బాల్‌రాజు, ఈ విషయాన్ని మంజులకు తెలపడంతో ఆమె కీసర పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీకు న్యాయం జరుగుతుందని అక్కడి పోలీసులు వివరించారు.

భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి, కేసు నమోదు

భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి, కేసు నమోదు

దీంతో మంజుల అన్న బాల్‌రాజుతో కలిసి శుక్రవారం ఉదయం తాండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివాహానికి బంధుమిత్రులతో వచ్చి పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో ఉన్న కిరణ్‌వర్మను తాండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి, కేసు నమోదు

భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి, కేసు నమోదు


అప్పటి వరకు తమ కుమార్తె పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని సంతోషంగా ఉన్న యువతి కుటుంబ సభ్యులు, ఆశ్చర్యానికి గురై, తేరుకొని తామూ మోసపోయామని గ్రహించి, పెళ్లి కొడుకు తమను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నంగా రూ. లక్ష, నాలుగు తులాల బంగారం కూడా ఇచ్చామని వారు పేర్కొన్నారు. అనంతరం వారికి దగ్గరి బంధువైన మరో యువకునితో తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశారు.

 భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి, కేసు నమోదు

భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి, కేసు నమోదు

మంజుల, రెండో పెళ్లి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిరణ్‌వర్మపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తాండూరు పట్టణ సీఐ వెంకట్రామయ్య తెలిపారు. పెళ్లికి ముందే నిజం తెలిసి తమ కుమార్తె జీవితం అన్యాయం కాకుండా కాపాడారని మంజులను కొనియాడారు. దీంతో రెండోపెళ్లి బృందం వారి నుంచి తీసుకున్న కట్నం తీరిగి ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు.

English summary
Man arrested for second marriage in Tandur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X