హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అంటూ కాల్ చేసి రూ. లక్షలకు టోపీ: అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బాగా జనాదరణ పొందిన ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమాన్ని ఆధారం చేసుకుని లాటరీ గెల్చారంటూ లక్షలు కాజేసిన ఓ మోసగాడ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం లాటరీలో రూ.25 లక్షలు గెల్చారంటూ.. హైదరాబాదీ ఆటోడ్రైవర్‌కు కాల్ చేశాడు.

అనంతరం అతనికి రూ.3.60 మేర కుచ్చుటోపీ పెట్టిన కోల్‌కతా విద్యార్థిని హైదరాబాద్ సైబర్‌ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌ హౌరాలోని బోస్‌రోడ్‌కు చెందిన విద్యార్థి పింటూ కుమార్‌ రాయ్‌ కేబీసీ పేరుతో దేశవ్యాప్తంగా బల్క్‌ ఎస్సెమ్మెస్‌లు పంపుతుంటాడు.

 A man arrested for fraud in West Bengal

తన వలలో పడినవారికి మాయమాటలు చెప్పి తన ఖాతాలో నగదు వేయించుకుంటుంటాడు. ఈ క్రమంలోనే.. నగరానికి చెందిన నగేష్‌ అనే ఆటో డ్రైవర్‌ ఇతడి వలలో చిక్కి రూ.3.60 లక్షలు పింటూ ఖాతాలో వేశాడు.

అనంతరం ఎలాంటి సమాచారం లేకపోవడంతో తాను మోసపోయిన విషయాన్ని గ్రహించిన ఆటో డ్రైవర్ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేసి, కోల్‌కతాకు వెళ్లి పింటూను అరెస్ట్‌ చేసి, ట్రాన్సిట్‌ వారంట్‌తో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

English summary
A man arrested for fraud in West Bengal by Cyberabad Police on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X