హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ విధ్వంసానికి ఐసిస్ కుట్ర: అసలు ఉగ్రవాది కువైట్‌లో అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ విధ్వంసానికి కుట్ర చేసిన ఐసిస్ అనుమానితులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు భారతదేశం నుంచి యువతను రిక్రూట్ చేస్తున్నఉగ్రవాదిని కువైట్‌లో అరెస్టు చశారు. భారత జాీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ ఇచ్చిన సమాచారం మేరకు కువైట్‌లో అతన్ని అరెస్టు చేసినట్లు సమాచారం.

అతన్ని అబ్దుల్లా హదీ అబ్దుల్ రెహ్మాన్ ఆల్ ఎనెజిగా గుర్తించారు. భారతదేశంలో ఐఎస్ఐఎస్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న అరీబ్ మజీద్‌కు అతను ఆర్థిక సాయం అందించినట్లు తెలుస్తోంది. హదీ భారతదేశం నుంచి యువతును రిక్రూట్ చేసుకోవడంతో పాటు ఐసిస్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్లు చెబుతున్నారు.

ISIS

యువతను రిక్రూట్ చేసే వారికి ఒక్కొక్కరికి అనతు వేయి అమెరికా డాలర్లు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచి 2013లో తిరిగి వచ్చిన తర్వాత ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తూ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు అతను అంగీకరించాడని అంటున్నారు.

కువైట్ అధికారులు అతన్ని అరెస్టు చేసి, అభియోగాలు మోపారు. 2015 మేలో కల్యాణ్ నుంచి నలుగురు యువకులు పశ్చిమాసియా దేశాల్లోని పవిత్ర స్థలాలను దర్శించడానికి వెళ్లారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు. వారు ఐసిస్‌లో చేరి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

ఇరాక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మజీద్‌ను 2015లో ఎన్ఐఎ అరెస్టు చేసింది. మజీద్ కువైట్‌ నుంచి కొన్ని నిధులు పొందినట్లు ఎన్ఐఎ విచారణలో గుర్తించింది. మజీద్ ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసిన వ్యక్తిని గుర్తించడానికి ఎన్ఐఎ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటిని పంపించింది.

హైదరాబాదులో అరెస్టయిన ఉగ్రవాదులకు కూడా హదీ నుంచి ఆర్థిక సాయం అందినట్లు భావిస్తున్నారు. భారతదేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఐసిస్‌కు రిక్రూట్ చేస్తున్న వ్యక్తిని విదేశాల్లో పట్టుకోవడం ఇదే తొలిసారి. హదీని భారతదేశానికి రప్పించి, విచారించే అవకాశం ఉంది.

English summary
The Kuwaiti authorities on Saturday arrested key ISIS recruiter Abdulla Hadi Abdul Rehman Al Enezi based on a tip-off by the National Investigation Agency (NIA). Hadi is believed to have funded Indian ISIS operative Areeb Majeed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X