హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఢిల్లీకి పంపిస్తావా?, నీ కూతురి నగ్న చిత్రాలు లీక్ చేయమంటావా?'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ యువతిని ప్రేమ పేరుతో మభ్య పెట్టాడో యువకుడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఆమె నగ్న చిత్రాలు కూడా సంపాదించాడు.

ఇటీవలే ఆమెకు వేరే యువకుడితో నిశ్చితార్థం జరగడంతో.. నగ్న చిత్రాలను అడ్డుపెట్టుకుని ఆమె తండ్రిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ఓ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థలో పనిచేసే వ్యక్తికి గత నెల 27న 70148 34253 నంబరు నుంచి బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వచ్చాయి. 'నీ కూతురి నగ్నచిత్రాలు నా వద్ద ఉన్నాయి.. ఆమెను ఢిల్లీకి పంపించు.. లేకపోతే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తా' అంటూ అందులో బెదిరించాడు.

Man blackmailing womans father with nude pictures arrested in delhi

దీంతో బాధితుడు వెంటనే సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు గుర్గావ్‌కు చెందిన దేవేంద్రసింగ్‌(25)గా గుర్తించారు. జైపూర్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో అతనో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు.

ఫేస్‌బుక్‌ ద్వారా బాధితుడి కూతురితో పరిచయం పెంచుకున్నట్టు గుర్తించారు. ఆ క్రమంలోనే ఆమె నగ్న చిత్రాలు సంపాదించాడని, ఆమెకు పెళ్లి కుదిరిందని తెలియడంతో.. బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని గుర్తించారు.

హైదరాబాద్ సైబర్ టీమ్ గుర్గావ్ సైబర్ క్రైమ్ టీమ్‌కు సమాచారం అందించడంతో నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారని సమాచారం.

English summary
Cyberabad Police arrested a man in Delhi for allegedly blackmailing a woman threatening to upload her nude pictures on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X