మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: బైక్‌కు అడ్డం వచ్చిన చిన్నారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ఓ రెండేళ్ల బాలుడు తన బైక్‌కు అడ్డం వచ్చాడని అతికిరాతంగా పెట్రోల్ పోసి నిప్పంటించాడో దుర్మార్గుడు. ఈ అమానవీయ ఘటన పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

బిలాల్‌నగర్‌కు చెందిన ఫైజర్ ఖాన్ బైక్ రైడింగ్ చేస్తుండగా ఇద్దరు చిన్నారులు అడ్డుగా వచ్చారు. దీంతో ఆగ్రహంతో తన వద్ద బాటిల్‌లో ఉన్న పెట్రోల్‌ను మహమ్మద్ అలీషేర్ అనే రెండేళ్ల బాలుడిపై పోశాడు. అదెంటో తెలియని అలీషేర్ నవ్వడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఫైజర్ ఖాన్.. నిప్పంటించి పరారయ్యాడు.

గమనించిన బంధువులు.. తీవ్రంగా గాయపడిన బాలున్ని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గాలింపు చేపట్టి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండుకు తరలించారు.

set ablaze

కారును ఢీకొన్న లారీ: ముగ్గురి మృతి

మెదక్‌ జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రాహదారిపై లారీ .. కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భారీ అగ్ని ప్రమాదం: తప్పిన ప్రాణ నష్టం

వరంగల్‌ శివనగర్‌లోని టీసీఐ ట్రాన్స్‌పోర్టు గోదాములో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాము నుంచి పొగరావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

వరంగల్‌, హన్మకొండ, గొర్రెకుంట ఇండస్ట్రియల్‌కు చెందిన అగ్నిమాపక కేంద్రాల అధికారులు, సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటికిపైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ట్రాన్స్‌పోర్టు సిబ్బంది తెలిపారు.

గోదాములో మెడికల్‌, సీడ్స్‌, బట్టలు, అటోమొబైల్‌ పరికరాలు ఉన్నట్లు వివరించారు. సకాలంలో గుర్తించడంతో గోదాముపైన నివాసం ఉంటున్న 5 కుటుంబాల వారు ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. ప్రమాదంపై మిల్స్‌కాలనీ పోలీసులు, అగ్నిమాపక అధికారులు విచారణ చేపట్టారు.

English summary
A man burned a child in hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X