హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆల్కహాల్‌ అనుకుని యాసిడ్ తాగిన ప్రభుత్వ ఉద్యోగి.... ! చికిత్స పొందుతూ మృతి... !

|
Google Oneindia TeluguNews

మద్యం మత్తులో మనిషి ఏం చేస్తారో వాడికే తెలియదు. మద్యం అలవాటు ఉన్నవారు ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం ఖాయంగా ఉంటుంది. సమాజంలో అయ్యో ఘోరాలకు నేరాలకు ప్రధాన కారణం మద్యం అని చెప్పక తప్పదు..దీంతోపాటు తాగిన మత్తులో విచిత్ర వేశాలు సైతం వేస్తారు. ఇలా మద్యం మత్తులో ఉన్నవారి లీలలు చెప్పడం అన్ని ఇన్ని కావు, ఇలా చెప్పుకుంటూ.. పోతే బోలేడన్ని స్లోరీలు ఉంటాయి....

మద్యం మత్తులో ఉన్నవారు విచిత్ర వేశాలు వేస్తారు కాని.... హైదరాబాద్ చెందిన ఓ వ్యక్తి మాత్రం అంతకంటే విచిత్రమైన పని చేసి తన ప్రాణాలను పోగోట్టుకున్నాడు. రోజు తాగే మద్యం వాసనను కూడ పసిగట్టలేకపోయాడు, విపరీతంగా మద్యం సేవించడంతో ఏది మద్యం సీసానో ఏదీ యాసిడ్ సీసానో పసిగట్టలేకపోయాడు.

man died after he consumed acid for mistaking for alcohol

బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన గణేష్ [36] మింట్ కాంపౌండ్ లో గ్రేడ్ 4 ఉద్యోగిగా చేస్తున్నాడు. అయితే గణేష్‌కు రోజు మద్యం తాగే అలవాటు ఉంది. తాను ఆఫీసు పని అయిపోయిన మద్యం సేవిస్తాడు..ఇలా ఎప్పటిలాగే గత గురువారం కూడ మద్యం సేవించి విపరీతమైన మత్తులో ఇంటికి చేరుకున్నాడు.

సాయంత్రం ఇంటికి చేరుకున్న గణేష్‌కు మరింత ఆల్కహాల్ తీసుకోవాలని అనిపించింది. దీంతో ఇంట్లో ఉన్న మందు బాటిల్ కు బదులు అక్కడే ఉన్న యాసిడ్‌ను తాగాడు....తాగేటప్పుడు తాపిగా తాగిన గణేష్ కొద్ది సేపటికి గొంతు మండుతుండడంతో లబొదిబో అన్నాడు. విషయం తెలుసుకున్న కుటుంభ సభ్యులు వెంటనే ఆసుత్రికి తరలించారు. అయితే అప్పటికే యాసిడ్ పూర్తి గొంతుతో పాటు శరీర భాగాలను నాశనం చేసంది. దీంతో చికిత్స నేపథ్యంలో రెండు మూడు రోజులు బ్రతికిన గణేష్ ఆదివారం ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A 36-year-old man died on sunday after he consumed acid for mistaking for alcohol here at New Bowenpally. Ganesh (36), a grade-4 officer in Mint Compound consumed alcohol on May 9 and returned home in an intoxicated state. Later, he saw an acid bottle at home and consumed it mistaking it for alcohol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X