హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముంబైలో చిక్కాడు: ‘హార్లీ డేవిడ్‌సన్’ బైక్ దొంగని పట్టించిన సెల్‌ఫోన్ సిగ్నల్స్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టెస్ట్‌డ్రైవ్ పేరుతో హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని హార్లీ డేవిడ్‌సన్ షోరూంలో ఖరీదైన బైక్‌తో పారిపోయిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా అతడిని ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈనెల 1న బంజారాహిల్స్‌లోని హార్లీ డేవిడ్సన్‌ షోరూంలో ఆరు లక్షల విలువైన వాహనాన్ని ట్రయల్‌ రన్‌ చూస్తానని చెప్పి బైక్‌తో పరారైన సంగతి తెలిసిందే. షోరూం నిర్వహకుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అతడు భీమవరానికి చెందిన తుర్లపాటి కిరణ్‌ అని, ఓఎన్‌జీసీలో సబ్‌మెరైన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడు హైదరాబాద్‌ సైనిక్‌పురిలో ఉంటున్నాడు. అతడి తండ్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి ప్రకాశరావు. కిరణ్‌ను పూర్తిస్థాయిలో విచారించేందుకు ముంబైలోనే ఉంచారు. శుక్రవారం ఉదయం అతడిని హైదరాబాద్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.

Man escaped Harley Davidson taken for Test Drive was caught by police

హార్లీ డేవిడ్సన్‌ బైకు గురించి క్షుణ్ణంగా ముందుగానే అన్ని తెలుసుకుని మరీ కొట్టేసినట్లు తెలిసింది. హార్లీ డేవిడ్సన్‌ బైక్ లీటరుకు 12 కిలోమీటర్లు వస్తుందని ముందే తెలుసుకున్న కిరణ్, ఏ విధంగా చోరీ చేయాలని పక్కా ప్రణాళిక రచించుకున్నాడు.

ముందుగా బైక్‌ కొట్టేసేందుకు ఇరవైవేలు సమకూర్చుకున్నాడు. ఒకసారి ట్యాంకు నింపితే 150 కిలోమీటర్లు పోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లతో చోరీ చేశాడు. సాగర్‌సొసైటీలోని షోరూంనకు వెళ్లకముందు ముంబైకి ఓ ఫోన్‌ చేశాడు. అదే ఇప్పుడు అతడిని పట్టించింది.

ముందుగా శామీర్‌పేట సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోలు కొట్టిచ్చినట్లు పోలీసులకు సీసీ ఫుటేజీ దొరికింది. ఆ తర్వాత కరీంనగర్‌ హైవే మీదుగా సదాశివపేట చేరుకున్నాడు. అక్కడ హీరో హోండా షోరూంలో హెల్మెట్‌ కొనుగోలు చేశాడు. తర్వాత సదాశివపేట శివారు ప్రాంతంలో ఓ పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ పోయించుకున్నట్టు విచారణలో తేలింది.

ఆ తర్వాత ఓ ప్రత్యేక బృందంగా ఏర్పడి ముంబైకి వెళ్లారు. అక్కడి శివారు ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
On the pretext of taking a test drive, a man in his thirties drove off a Harley Davidson bike with the intention of not returning back, giving a nightmare to the showroom officials. It takes months of savings for an average person aspiring to purchase the muscular masterpiece valuing Rs. 5.7 lakhs approximately, but this conman opted for a shortcut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X