హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెస్ట్ డ్రైవింగ్ పేరు చెప్పి బైక్‌తో ఉడాయించాడు: దొరికాడు (ఫొటో)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టెస్ట్‌డ్రైవ్ పేరుతో హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని హార్లీ డేవిడ్‌సన్ షోరూంలో ఖరీదైన బైక్‌తో ఓ వ్యక్తి ఉడాయించాడు. అతని కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.మంగళవారం సాయంత్రం షోరూంకు వచ్చిన యువకుడు బైక్‌ను టెస్ట్ డ్రైవ్ చేస్తానంటూ తీసుకుని పారిపోయాడు.

అప్రమత్తమైన పోలీసులు అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించి గాలింపు చేపట్టారు. నిందితుడు మొదటగా శామీర్‌పేట దాకా వెళ్లి అక్కడి నుంచి రింగ్‌రోడ్డు ద్వారా సంగారెడ్డి వైపు వెళ్లినట్లు తేలింది. సదాశివపేటకు వెళ్లి అక్కడ ఓ హెల్మెట్‌ను కొనుగోలు చేసినట్లు షాపు యజమాని షోరూం నిర్వాహకులకు ఫోన్‌లో తెలిపాడు.

man escapes with bike taking for test driving

దీంతో ఆ రూట్లో వెళ్లే వాహనాలపై నిఘా పెట్టారు. బైక్‌లో కేవలం 10 నుంచి 12 లీటర్ల పెట్రోల్ మాత్రమే కెపాసిటీ ఉంటుందని, సుమారు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగలడని గుర్తించారు. అన్ని దారుల్లో ఉన్న పెట్రోల్ బంకులను అప్రమత్తం చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

బంజారాహిల్స్‌లోని హార్లీడేవిడ్ సన్ బైక్ షోరూం నుంచి ట్రయల్ రన్ పేరుతో బైక్‌ను దొంగిలించిన దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఓ ప్రధాన రహదారి వద్ద బైక్‌పై వెళుతుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అతడు దొంగిలించిన బైక్ విలువ సుమారు రూ.6లక్షలకు పైగానే ఉంటుందని షోరూం నిర్వాహకులు తెలిపారు. ఖరీదైన దుస్తులు ధరించి, ధనవంతుడిగా చెప్పుకుంటూ బైక్‌లను దొంగిలించడమే అతడి విధిగా తెలుస్తోంది. ఈ దొంగ మద్రాస్‌లో ఐఐటీ చదివి, ఓఎన్‌జీసీలో ఉద్యోగం చేస్తుండడం గమనార్హం.

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ క్రికెట్ బుకీగా మారాడు. ముగ్గురు ఏజెంట్‌లతో కలిసి బెట్టింగ్‌లను నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాదు టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లంగర్‌హౌజ్‌లో నివాసముంటున్న టి. సత్యప్రకాష్ సింగ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్. వ్యాపారంలో లాభాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. వీటిని అధిగమించేందుకు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.

man escapes with bike taking for test driving

అమిన్ మధాని, మిరాన్ బరాడే, సాహీల్ నురానీను ఏజెంట్లుగా పెట్టుకున్నాడు. వీరు పంటర్ల నుంచి నగదును వసూలు చేసి సత్యప్రకాష్ సింగ్‌కు ఇస్తుంటారు. బెట్టింగ్ దందాపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి అకస్మిక దాడులు జరిపి ఈ నలుగురిని అరెస్టు చేశారు. 27వేల నగదు , టీవి, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు బెట్ కట్టినట్లు దర్యాప్తులో తేలింది. విచారణ కోసం ఈ ముఠా సభ్యులను లంగర్‌హౌజ్ పోలీసులకు అప్పగించారు.

English summary
A man escaped from the show room at Banjarahills in Hyderabad with bike taking on the pretext of test driving.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X