కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్‌లో యువకుడి అనుమానాస్పద మృతి, ప్రియురాలి ఫ్యామిలీ చంపిందని ఆరోపణ

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఓ హత్య కలకలం రేపుతోంది. దీనిని పరువు హత్యగా అనుమానిస్తున్నారు. శంకరపట్నం మండలం తాడికల్‌లో కుమార్ అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ మృతికి ప్రేమ వ్యవహారం కారణంగా కనిపిస్తోంది. యువతి తరఫు బంధువులు హత్య చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.

<strong>తన చెల్లెలితో వివాహేతర సంబంధం, భర్తపై కోపంతో కొడుకును చంపిన తల్లి</strong>తన చెల్లెలితో వివాహేతర సంబంధం, భర్తపై కోపంతో కొడుకును చంపిన తల్లి

దీనిపై కమిషనర్ కమల్ హాసన్ రెడ్డి మాట్లాడారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు. మైనర్ అమ్మాయితో కుమార్‌కు పరిచయం ఉందన్నారు. ఏడాది క్రితం అమ్మాయి తల్లిదండ్రులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారని తెలిపారు.

Man found dead in Telanganas Karimnagar, honour killing suspected

ఈ కేసుకు సంబంధించి కుమార్ ఏడాది క్రితం జైలుకు వెళ్లాడని తెలిపారు. కుమార్ జైలు నుంచి వచ్చాక అమ్మాయిని తీసుకు వెళ్లాడని సీపీ తెలిపారు. తర్వాత రోజు కుమార్ ఎవరికీ కనిపించలేదన్నారు.

తల్లిదండ్రులకు కుమార్ ఫోన్ చేసి ఇంటికి వచ్చి మాట్లాడుతానని చెప్పాడని అన్నారు. అనంతరం సోమవారం సాయంత్రం కుమార్ అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారన్నారు. కుమార్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.

కుమార్ మృతదేహం తాడికల్ శివారులోని వంకాయగూడెం గ్రామం వద్ద ఓ పత్తి చేనులో మంగళవారం ఉదయం గుర్తించారు. కుమార్ ప్రేమించింది అదే గ్రామానికి చెందిన యువతిని. గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. పోలీసులు అక్కడకు వచ్చి గ్రామస్థులకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసు వాహనంపై వారు దాడి చేసి అద్దాలు పగులగొట్టారు.

English summary
Police said Gaddi Kumar had been in love with a girl from an adjacent village. Her parents did not approve of the relationship as they belonged to different castes. Kumar went to talk to the girl on Monday evening and did not return. His body was later found in the fields.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X