ఛాటింగ్‌కు రూ.400, న్యూడ్ వీడియో కాల్‌కు రూ.1500... యువతిని వేధించి కటకటాలపాలైన ప్రబుద్ధుడు..
హైదరాబాద్ : అతడు ప్రేమించాడు. ఆమె నిరాకరించింది. దీంతో యువతిపై పగ పెంచుకున్నాడు. ఆమెను వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా యువతి గురించి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేశాడు. ఆమె పేరుతో సెక్స్ చాట్, న్యూడ్ వీడియో కాల్స్ అంటూ వసూళ్లకు తెర తీశాడు. బాదితురాలి ఫిర్యాదుతో చివరకు పోలీసులకు చిక్కి ప్రస్తుతం కటకటాల లెక్కపెడుతున్నాడు.
శంషాబాద్‌లో దారుణం.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు : కొనఊపిరితో కొట్టుమిట్టాడు
ప్రేమను నిరాకరించిన యువతి
నిందితుడు నవీన్ కుమార్‌ది ఖమ్మం జిల్లా నిజాంపేట. అక్కడే జెడ్పీ సెంటర్లోని సన్ డయాగ్నాస్టిక్స్లో పనిచేస్తున్నాడు. కొత్తగూడెం జేవీఎస్ చైతన్య కాలేజ్‌లో ఇంటర్ చదివాడు. చదువుకునే సమయంలో తన క్లాస్‌మేట్‌ను ప్రేమించిన నవీన్ ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోయాడు. అయితే ఈ మధ్య ఆ కాలేజీ విద్యార్థులు జేవీఎస్ బైపీసీ పేరుతో ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి అడ్మిన్‌గా సదరు యువతికి ప్రేమ విషయం చెప్పాడు. అయితే ఆమె దాన్ని తిరస్కరించడంతో నవీన్ కోపంతో రగిలిపోయాడు.
ఫేస్బుక్లో అసభ్య సందేశాలు
సదరు యువతి పగ పెంచుకున్న నవీన్ వేధింపులకు దిగాడు. వాట్సప్ గ్రూపులో ఆమెను ఉద్దేశించి అనుచిత పోస్టులు చేయడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె ఈ నెల 18న నవీన్‌ను వాట్సప్ గ్రూప్ నుంచి తొలగించడంతో పాటు అతని నెంబరును బ్లాక్ చేసింది. దీంతో నవీన్ మరింత కక్ష పెంచుకున్నాడు. యువతి పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో యువతి ఫొటోలతో పాటు అసభ్యకరమైన సందేశాలు పోస్ట్ చేశాడు. సెక్స్ చాట్‌కు రూ. 400, న్యూడ్ వీడియో కాల్‌కు రూ.1500 చెల్లించాలని పోస్ట్ చేశాడు. మనీ డిపాజిట్ చేసేందుకు ఫోన్ పేతో పాటు ఎస్బీఐ అకౌంట్ నెంబర్లు ఇచ్చాడు. దీంతో పలువురు అతని ఖాతాలో డబ్బులు జమ చేశారు.
పోలీసులకు ఫిర్యాదు
ఫేస్బుక్లో పోస్ట్ గురించి తెలియడంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాడిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజేంద్రనగర్‌లో ఉన్న నవీన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకుని కటకటాల వెనక్కి నెట్టారు.