• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మేనత్త భర్తే.. బాలికపై ఆర్నెళ్లుగా.. హైదరాబాద్‌లో వెలుగుచూసిన దారుణం..

|

ఇంటి నుంచి బయటకొచ్చింది మొదలు.. తిరిగి ఇల్లు చేరేదాక ఆడపిల్లల భద్రతపై అనుక్షణం తల్లిదండ్రులకు బెంగ ఉంటుంది. ఎంత కంటికి రెప్పలా కాపాడుకున్నా సరే.. అయినవాళ్లే బిడ్డలను కాటేయడం వర్ణించలేని వేదన. తాజాగా హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లోనూ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. సొంత మేనత్త భర్తే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆర్నెళ్ల నుంచి ఆ అమాయక బాలికపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్‌కు..

తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్‌కు..

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రెండు కుటుంబాలు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లోని నిజాంపేట్ వచ్చి స్థిరపడ్డాయి. బావ,బావమరుదలయ్యే ఆ రెండు కుటంబాల వ్యక్తులు.. స్థానికంగా ఉన్న అపార్టుమెంటుల్లో వాచ్‌మెన్లుగా పనికి కుదిరారు. ఇందులో బావకు ఇద్దరు కుమార్తెలు కాగా.. బావమరిదికి కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బావ కూతురిపై కన్ను..

బావ కూతురిపై కన్ను..

ఇరువురి పిల్లలు దాదాపు ఒకే వయసువారు. అంతా కలిసే చదువుకుంటున్నారు. పైగా బంధువులు కూడా కావడంతో ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెళ్తుంటారు. అయితే కొద్దిరోజుల క్రితం వరకు బాగానే ఉన్న బావమరిది ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. బావ పెద్ద కుమార్తె(13) అతను కన్నేశాడు. బలవంతంగా ఓరోజు ఆమెపై అత్యాచారం జరిపాడు. విషయం బయటకు పొక్కితే చంపేస్తానని హెచ్చరించాడు. అప్పటినుంచి దాదాపు ఆర్నెళ్లుగా ఆమెపై బలవంతంగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.

 ఇలా వెలుగులోకి..

ఇలా వెలుగులోకి..

గత మూడు నెలల నుంచి బాధిత బాలికకు నెలసరి రావడం లేదు. తరుచూ తీవ్ర కడుపునొప్పి వస్తోంది. ఇదే విషయం ఇటీవల తల్లికి చెప్పడంతో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. దీంతో ఆమె గర్భవతి అని తేలింది. బాలికను గట్టిగా నిలదీయడంతో.. మేనత్త భర్త నిర్వాకం గురించి బయటపెట్టింది. ఆర్నెళ్లుగా తనపై అతను అత్యాచారానికి పాల్పడుతున్నాడని వాపోయింది.

  Disha Case : పోలీసులు సైతం నివ్వెరపోయేలా: తొమ్మిది హత్యలు! || Oneindia Telugu
  పోలీసులకు ఫిర్యాదు..

  పోలీసులకు ఫిర్యాదు..

  తన బావే తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసి బాధిత బాలిక తండ్రి తీవ్ర షాక్‌కి గురయ్యాడు. అనంతరం భార్యతో కలిసి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. గురువారం అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్టు సమాచారం.

  English summary
  The police on Thursday arrested a man in Nizampet,Hyderabad for allegedly raping his 13-year-old relative.The police said that the woman was four months pregnant and the 30-year-old suspect had allegedly raped her earlier also but she did not report the incident fearing social stigma.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more