హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కాబావలకు భారమని, పక్కా ప్లాన్‌తోనే: కనికరం లేకుండా చంపేసిన మేనమామ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దివ్యాంగులైన విష్ణువర్ధన్ రెడ్డి, సృజనలను హత్య చేసిన మల్లికార్జున్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు. మానసిక, శారీరక లోపాలతో ఇబ్బంది పడుతున్న ఆ పిల్లల బాధ, తల్లిదండ్రుల ఆవేదన వర్ణణాతీతం.
ఇవన్నీ చూస్తున్న మేనమామ.. దివ్యాంగులిద్దరూ కుటుంబానికి భారమని, వారిని అడ్డుతొలగిస్తే అక్కాబావలు సుఖంగా ఉంటారని భావించాడు. వెంటనే ప్రణాళికను సిద్ధం చేసుకుని శుక్రవారం అర్ధరాత్రి అమలుచేశాడు. పిల్లలిద్దరినీ చంపేసి, మృతదేహాలను తరలిస్తుండగా ఇంటి యజమాని పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

గుంటూరు జిల్లా గురజాల మండలం అబ్బాపురం గ్రామానికి చెందిన కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రెడ్డి లాబ్స్‌ పరిశ్రమలో ప్లాంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. మిర్యాలగూడలోని రెడ్డికాలనీలో శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దంపతులు ఉంటున్నారు. వీరికి సృజనారెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి కవలలు, వీరితోపాటు రోహన్ రెడ్డి(4) పిల్లలు. కవలలిద్దరూ దివ్యాంగులు. చైతన్యపురిలో ఉంటున్న లక్ష్మి సోదరుడు మల్లికార్జున రెడ్డికి దివ్యాంగులంటే ఇష్టంలేదు. మనోవికాసం పెరిగేందుకు హైదరాబాద్‌లో ఏదైనా సంస్థలో చేర్పించాలని పలువురు సలహా ఇచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఠాకూర్‌ హరిప్రసాద్‌ మానసిక వికలాంగుల సంస్థలో గతేడాది చేర్చారు. పిల్లలిద్దరినీ వేసవి సెలవులకు ఇటీవల తండ్రి మిర్యాలగూడ తీసుకువచ్చాడు.

ఘోరం: స్విమ్మింగ్ నేర్పిస్తానని అక్క పిల్లలను చంపేసిన మేనమామ, షాకింగ్ రీజన్!ఘోరం: స్విమ్మింగ్ నేర్పిస్తానని అక్క పిల్లలను చంపేసిన మేనమామ, షాకింగ్ రీజన్!

అక్కా, బావలు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడగ్గా

అక్కా, బావలు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడగ్గా

మల్లికార్జున్ రెడ్డి పథకం ప్రకారమే చిన్నారులను చంపాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. అతనిపై ఐపీసీ 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని విలేకరులు పోలీసులను ప్రశ్నించగా.. నిందితుడు, అతడి అక్కాబావల సెల్‌ఫోన్ కాల్‌డేటాను విశ్లేషించనున్నామని, వీటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరిన్ని సాక్ష్యాధారాల కోసం పోలీసులు మల్లికార్జునరెడ్డి ఉంటున్న గది వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను తీసుకున్నారు. కారు వద్దకు మృతదేహాలను నిందితుడు తరలిస్తున్న దృశ్యాలు, అతనికి సహకరించిన కారుడ్రైవరు వివేక్ రెడ్డికి సంబంధించిన, కారు వెనక సీట్లో ఒక మృతదేహం, డిక్కీలో మరో మృతదేహం పెట్టిన దృశ్యాలు అందులో ఉన్నాయన్నారు.

భార్యకు విడాకులిచ్చిన మల్లికార్జున్ రెడ్డి

భార్యకు విడాకులిచ్చిన మల్లికార్జున్ రెడ్డి

తన అక్కాబావల సంతోషానికి అడ్డుగా ఉండటం వల్లే వారిని చంపేశానని మల్లికార్జున్ రెడ్డి పోలీసులకు తెలిపాడు. శుక్రవారం అర్ధరాత్రి బావ శ్రీనివాస్ రెడ్డికి నిందితుడు ఫోన్‌ చేసి పిల్లలను హత్య చేసినట్లు సమాచారమిచ్చాడు. మిర్యాలగూడ నుంచి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మిలు శనివారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. బావమరిదిపై కేసు నమోదు చేయవద్దని, తాము ఫిర్యాదు చేయబోమని బావ చెప్పారు. నిందితుడు ఇంజినీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం పెళ్లి చేసుకున్న మల్లికార్జున్ రెడ్డి భార్యకు విడాకులిచ్చాడు.

గ్రామంలో విషాదం

గ్రామంలో విషాదం

దివ్యూంగుల తల్లిదండ్రులు లక్ష్మి, శ్రీనివాస రెడ్డిలది గుంటూరు జిల్లా గురజాల మండలం అంబాపురం. శ్రీనివాసరెడ్డి తన అక్క సరోజిని కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. పదేళ్ల తర్వాత కవలలు జన్మించారు. ఇద్దరూ దివ్యాంగులే. పన్నెండేళ్లుగా ప్రేమగా చూసుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం అబ్బాయి పుట్టాడు. లక్ష్మి తమ్ముడు మల్లికార్జున్ రెడ్డి చిన్నతనం నుంచి అంబాపురంలోనే నివాసం ఉండేవాడు. ఆ తర్వాత కొంతకాలం మిర్యాలగూడలో ఉన్నాడు. మల్లికార్జున్ రెడ్డికి పెళ్లయింది. కాని విభేదాల కారణంగా భార్యతో విడాకులు అయ్యాయి. ప్రస్తుతం వనస్థలిపురంలో ఉంటున్నాడు. ఇప్పుడు వనస్థలిపురం వచ్చాడు. శుక్రవారం వారిని చంపడంతో అంబాపురం గ్రామంలో విషాదం అలుముకుంది. శ్రీనివాస్ రెడ్డి పండుగలకు, ఇతర కార్యక్రమాలకు అంబాపురంలోని తన తమ్ముడు రామలింగా రెడ్డి ఇంటికి వచ్చేవాడు. జంట హత్యల వార్త విని గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.

నిద్రపోతున్నా కనికరం లేకుండా హత్య

నిద్రపోతున్నా కనికరం లేకుండా హత్య


కల్లాకపడం తెలియని దివ్యాంగులు ఏం పాపం చేశారని చంపారో తమకు అర్థం కావట్లేదని ఇంటి యజమాని మహేశ్వర్ రెడ్డి, స్థానికులు తెలిపారు. వారు ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో కనికరం లేకుండా చంపేశాడని కంటతడి పెట్టారు. ఎలాంటి తడబాటు లేకుండా శవాలను తీసుకు వచ్చాడని, దీంతో చాలా రోజుల నుంచే మనసులో చంపాలనే ఆలోచన ఉన్నట్లుగా భావిస్తున్నారు.

English summary
A man has been arrested for murdering two intellectually challenged kids as he did not want his sister, mother of the kids, to suffer. The incident was reported at Hyderabad's Chaitanyapuri police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X