హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్ధరాత్రి నడిరోడ్డుపై యువతి: మానవత్వం చూపిన యువకుడు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆడవారిపై రోజురోజుకు పెరుగుతున్నా ఆఘాయిత్యాలకు అడ్డులేకపోతున్న ఈ రోజుల్లో అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా కనిపించిన యువతిపై మానవత్వం చూపించాడో యువకుడు. వివరాల్లోకి వెళితే... అర్ధరాత్రి.. రోడ్డుపై ఒంటరిగా అమ్మాయి. ఆమెకు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి.

ఇంతలో ఆమెకు బైక్‌పై ఎదురుగా వస్తున్న ఓ యువకుడు కనిపించాడు. ఆమె ఏం చెబుతుందో అతగాడికి అర్థం కాకపోయినా లిఫ్ట్‌ ఇచ్చాడు. సుమారు అరగంట సేపు అటూ ఇటూ తిప్పాడు. చివరకు ఆమె అడ్రస్‌ను వెతకడంలో విఫలమైన ఆ యువకుడు చేసేదేమీ లేక ఆమెను పోలీసులకు అప్పగించాడు.

శనివారం అర్ధరాత్రి బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వై.సతీష్‌రెడ్డి కొంపల్లిలోని ఓ ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. జోరు వర్షం కురుస్తున్న వేళ, చిమ్మ చీకటిలో రోడ్డుపై ఉన్న 20 ఏళ్ల యువతి అతడి బైక్‌ను ఆపింది.

 Man shows humanity

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన యువతి కావడంతో ఆమె మాట్లాడే భాష అర్ధం కాకపోయనా మానవత్వంతో లిప్ట్ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్లాలి అని అడిగితే సైగలు చేస్తూ ఏదో చెబుతోంది కానీ అడ్రస్ మాత్రం చెప్పడం లేదు. ఇలా సుమారు అరగంట సేపు బైక్‌‍పై తిప్పిన సతీష్ రెడ్డి అనంతరం బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు.

దీంతో వారు వారు బేగంపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని చెప్పడంతో రాత్రి 11.30గంటల సమయంలో ఆమెను తీసుకెళ్లి బేగంపేట పోలీసులకు అప్పగించాడు. తన వివరాలు, ఫోన్‌ నెంబర్‌తో లెటర్‌ రాసి పోలీస్‌ ఉన్నతాధికారితో ఫోన్‌లో మాట్లాడాడు. దీంతో యువకుడు చేసిన పనికి ఆ పోలీసు ఉన్నతాధికారి ఫోన్‌లోనే అభినందించారు.

అనంతరం ఆదివారం ఉదయం యువతి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఒడిశా భాష మాట్లాడడంతో ఆ ప్రాంతం వారిని పిలిపించి ఆమెతో మాట్లాడించారు. తన పేరు సంగీత అని, తల్లిదండ్రులు మందలించడంతో పారిపోయి హైదరాబాద్‌కు వచ్చానని చెప్పింది. దీంతో వెంటనే యువతిని రెస్క్యూ హోంకు తరలించి, ఆమె తల్లిదండ్రులకు సమాచారాన్ని అందజేశారు.

English summary
Man shows humanity on odisha lady midnight in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X