కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్ జిల్లాలో వడ్డీల మోహన్ రెడ్డి వేధింపులకు మరొకరు బలి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో వడ్డీల మోహన్ రెడ్డి వేధింపులకు మరోకరు బలయ్యారు. తాజాగా మోహన్ రెడ్డికి చెందిన ఏజెంట్ శ్యాం ప్రసాద్ రెడ్డి వద్ద రూ. 2 లక్షలు అప్పుగా తీసుకున్న పాపానికి నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు.

సీబీఐ ఎంక్వైరీ: రోడ్డెక్కిన ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు (ఫోటోలు)

వివరాల్లోకి వెళితే... జిల్లాలోని బెజ్జంకి మండలం గుళ్లపల్లికి చెందిన నారాయణ రెడ్డి అనే వ్యక్తి గత కొన్నాళ్లుగా కరీంనగర్ పట్టణంలోని జ్యోతి నగర్‌లో నివాసముంటున్నాడు. తన కుటుంబ ఖర్చుల అవసరాల నిమిత్తం వడ్డీల మోహన్ రెడ్డి సంబంధించిన ఏజెంట్ శ్యాం ప్రసాద్ రెడ్డి వద్ద రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు.

అప్పు తీసుకునే సమయంలో నారాయణ రెడ్డి ఎకరం పొలానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను మోహన్ రెడ్డి వద్ద తాకట్టు పెట్టాడు. అయితే తాను తీసుకున్న రూ. 2 లక్షల అప్పుని తీర్చేశాడు. అయితే మోహన్ రెడ్డి మాత్రం తన ఎకరం పొలానికి సంబంధించిన డాక్యమెంట్‌ను మాత్రం తిరిగి ఇవ్వలేదు.

ఈ క్రమంలో బెజ్జంకి మండలంలోని పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేశాడు. అయితే మోహన్ రెడ్డి పోలీసు శాఖకు చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసు ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత గతేడాది కాలంగా నారాయణ రెడ్డి తన డాక్యుమెంట్‌ను తిరిగి ఇవ్వాలంటూ మోహన్ రెడ్డి పలు మార్లు ఆశ్రయించాడు.

కరీంనగర్ జిల్లాలో వడ్డీల మోహన్ రెడ్డి వేధింపులకు మరొకరు బలి

కరీంనగర్ జిల్లాలో వడ్డీల మోహన్ రెడ్డి వేధింపులకు మరొకరు బలి

ఈ క్రమంలో తనకు ఇంకా డబ్బు రావాల్సి ఉందని మోహన్ రెడ్డి వేధింపులకు గురి చేశాడు. ఈ వేధింపులతో చేసేదేమీ లేక నారాయణ రెడ్డి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను తీసుకున్న రుణం మొత్తాన్ని చెల్లించినప్పటికీ, తన పొలం తాలూకా డాక్యుమెంట్ ఇవ్వకపోవడం వల్లే తాను చనిపోతున్నానని నారాయణ రెడ్డి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

కరీంనగర్ జిల్లాలో వడ్డీల మోహన్ రెడ్డి వేధింపులకు మరొకరు బలి

కరీంనగర్ జిల్లాలో వడ్డీల మోహన్ రెడ్డి వేధింపులకు మరొకరు బలి

తన చావుకు కారణం వడ్డీల మోహన్ రెడ్డి వేధింపులే కారణమని అందులో పేర్కొన్నాడు. మరోవైపు తన భర్త చావుకి కారణం వడ్డీల మోహన్ రెడ్డి, అతని ఏజెంట్ శ్యాం సుందర్ రెడ్డిలేనని నారాయణ రెడ్డి భార్య బెజ్జంకి మండలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు.

కరీంనగర్ జిల్లాలో వడ్డీల మోహన్ రెడ్డి వేధింపులకు మరొకరు బలి

కరీంనగర్ జిల్లాలో వడ్డీల మోహన్ రెడ్డి వేధింపులకు మరొకరు బలి

ఇదిలా ఉంటే వడ్డీ వ్యాపారం చేస్తూ పలువురిని తుపాకులతో బెదిరించి ఆస్తులు కాజేశాడనే ఆరోపణపై మోహన్ రెడ్డి మీద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసు తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. కరీంనగర్ జిల్లా సీఐడీ శాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బొబ్బల మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ వ్యాపారం పేరిట వంద కోట్ల రూపాయలకు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి.

కరీంనగర్ జిల్లాలో వడ్డీల మోహన్ రెడ్డి వేధింపులకు మరొకరు బలి

కరీంనగర్ జిల్లాలో వడ్డీల మోహన్ రెడ్డి వేధింపులకు మరొకరు బలి

తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసులో బాధితులు గతంలో ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. ఈ కేసును సీబీఐ లేదా సుప్రీం కోర్టు జడ్జిచే ఈ కేసును విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు కోరారు.

English summary
Man suicide attempt in karimnagar because of ASI Mohan Reddy in Karim nagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X