వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన మునుగోడు- మన కాంగ్రెస్; మూడంచెల కార్యాచరణ; అమిత్ షా సభకు షాకిచ్చే ప్లాన్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు చావో రేవో అన్న చందంగా తయారైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తేనే, భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీకి పట్టు ఉంటుందని భావిస్తున్న రాజకీయపార్టీల నాయకులు మునుగోడులో జెండా ఎగరవేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉపఎన్నిక జీవన్మరణ సమస్యగా తయారయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగా మునుగోడులో రంగంలోకి దిగి కార్యాచరణ మొదలుపెట్టింది. టిఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టేలా కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతోంది.

మునుగోడులో కాంగ్రెస్ మూడంచెల కార్యాచరణ

మునుగోడులో కాంగ్రెస్ మూడంచెల కార్యాచరణ


మునుగోడు ఉప ఎన్నిక జరిగితే విజయం సాధించి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రజలను ఆకర్షించాలని పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. "మన మునుగోడు మన కాంగ్రెస్" పేరుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టి రావాలని, ప్రజల మద్దతును కూడగట్టాలని కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక అందులో భాగంగా మూడంచెల కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. ఈ మేరకు గాంధీభవన్లో జరిగిన భేటీలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ కీలక సమావేశం, సమావేశానికి చెరుకు సుధాకర్

మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ కీలక సమావేశం, సమావేశానికి చెరుకు సుధాకర్

మునుగోడు ఉప ఎన్నికపై చర్చించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్, టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితర ముఖ్య నేతలు, మునుగోడు ఉపఎన్నికపై చర్చించారు. అధికార టీఆర్ఎస్ ను ఏ విధంగా ఎదుర్కోవాలి? బీజేపీ దూకుడుకు ఏవిధంగా చెక్ పెట్టాలి అన్న అంశంపై కీలక సమావేశం నిర్వహించారు. ఇక ఈ భేటీలో మునుగోడు వ్యూహ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, కమిటీ సభ్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, అనిల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఇక నల్గొండ, భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులతోపాటు ఇటీవల పార్టీలో చేరిన డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా పాల్గొన్నారు.

మునుగోడులో కాంగ్రెస్ ప్లాన్.. మన మునుగోడు మన కాంగ్రెస్

మునుగోడులో కాంగ్రెస్ ప్లాన్.. మన మునుగోడు మన కాంగ్రెస్


ఇక మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఒక పక్క పార్టీ ముఖ్య నేతలతో భేటీలు నిర్వహించడంతో పాటు, మరోపక్క టీఆర్ఎస్ కు, బిజెపికి చెక్ పెట్టేలా కార్యక్రమాలను రూపొందించుకోవాలని, ఇదే సమయంలో మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదంతో నియోజకవర్గంలోని 175 గ్రామాలలో ముఖ్య నాయకులు పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నియోజకవర్గంలో ఆజాదీ గౌరవ్ యాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 13న నారాయణపురం నుండి చౌటుప్పల్ వరకు 13 కిలోమీటర్లు నిర్వహించే యాత్రకు రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.

మండలాల వారీగా నాయకులతో భేటీలు.. నియోజకవర్గంలో పర్యటన

మండలాల వారీగా నాయకులతో భేటీలు.. నియోజకవర్గంలో పర్యటన

ఇక ఆపై 16వ తేదీ నుండి 12వ తేదీ వరకు మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశాలకు కూడా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. 16వ తేదీన నాంపల్లి, 17వ తేదీన మర్రిగూడ, 18వ తేదీన చుండూరు, 19వ తారీఖు మునుగోడు లోని నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు చెందిన కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఇక ఈ నెల 20వ తేదీన మునుగోడు టార్గెట్ గా,అదే సమయంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా "మన మునుగోడు మన కాంగ్రెస్" నినాదంతో నియోజకవర్గం అంతా చుట్టిరావాలని నిర్ణయం తీసుకున్నారు.

Recommended Video

ప్రధాని మోడీకి పెరుగుతున్న ఆదరణను సొమ్ము చేసుకుంటూ *Politics | Telugu OneIndia
 అమిత్ షా సభకు షాక్ ఇచ్చే ప్లాన్ లో కాంగ్రెస్ .. టీఆర్ఎస్ కు ధీటుగా వ్యూహాలు

అమిత్ షా సభకు షాక్ ఇచ్చే ప్లాన్ లో కాంగ్రెస్ .. టీఆర్ఎస్ కు ధీటుగా వ్యూహాలు

ఇక బీజేపీకి చెక్ పెట్టడానికి ఈనెల 21వ తేదీన అమిత్ షా సభ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా టిఆర్ఎస్ పార్టీ మునుగోడులో ప్రత్యక్షంగా రంగంలోకి దిగకపోవడంతో, పార్టీ వ్యూహాలను బట్టి, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను నిర్దేశించుకోవాలని నిర్ణయించారు. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నికపై టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్న నేపథ్యంలో మునుగోడులో త్రిముఖ పోరు కొనసాగనుందని తెలుస్తుంది. మరి మునుగోడు కోసం ఇన్ని వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఈ ఉపఎన్నికలో సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

English summary
The Congress has decided for a three-step activity in the name of Mana Munugodu- Mana Congress. congress has devised strategies to shock TRS and BJP. Congress has planned to shock Amit Shah meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X