మంచిర్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచిర్యాల ఏసీసీ సస్పెన్షన్, తెలిసినవారికి పాస్ ఇవ్వడంతో.. ఎలా బయటపడిందంటే...?

|
Google Oneindia TeluguNews

మంచిర్యాల ఏసీపీ లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. వాహనాల పాసుల జారీలో అవకతవకలు జరిగినందున ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతనిని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేసినట్టు రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. తనకు తెలిసిన వ్యక్తికి అక్రమంగా పాసు జారీచేశారని ఉన్నతాధికారులు గుర్తించారు. నిబంధనలు అతిక్రమించినందుకే చర్యలు తీసుకున్నామని సీపీ వివరించారు.

వాస్తవానికి అవసరం ఉన్న వారు ఆన్‌‌లైన్‌లో పాసు తీసుకోవాలి. కానీ లక్ష్మీనారాయణ మాత్రం తనకు తెలిసినవారికి పాస్ ఇప్పించాడు. ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. తన స్నేహితుడిని కలిసి.. ఎలా వచ్చానో వివరించారు. తన స్నేహితుడు మంచిర్యాల ఏసీపీ పాసు ఇప్పించాడని.. దానికి సంబంధించిన కాపీని కూడా చూపించారు. అయితే అతని మిత్రుడు హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్నతాధికారి తెలుసు.. తనకు పాస్ ఇవ్వాలని కోరడంతో విషయం బయటపడింది.

mancherial acp suspend due to pass misuse..

Recommended Video

Lockdown: Kanpur Police Perform 'Aarti' Of People who Are Roaming Out During Lockdown

అవసరం ఉన్నవారు మాత్రమే పాసు కోసం ఆప్లై చేసుకోవాలని సదరు అధికారి తెలిపాడు. కానీ తన స్నేహితుడికి మంచిర్యాల ఏసీపీ పాసు ఇప్పించారని, దానికి సంబంధించిన కాపీని సదరు అధికారికి పంపించారు. దీనిని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంతో.. వారు సీరియస్‌గా తీసుకున్నారు. అతని స్నేహితుడు వచ్చిన విధానాన్ని పరిశీలించారు. హైదరాబాద్‌‌లో అవసరం లేకున్నా వచ్చారని.. మిస్ యూజ్ చేశారని విచారణలో తేలింది. దీంతో జరిగిన క్రమంపై ఎంక్వైరీ చేసి.. ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. మంచిర్యాల ఏసీపీ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేశారు.

English summary
mancherial acp laxmi narayana suspend due to pass misuse issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X