హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయ్ సినిమా ఎఫెక్ట్: టి-బిజెపి నేతపై మంచు విష్ణు ఆగ్రహం, మోడీ అంటే గౌరవం

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహా రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవీఎల్ నర్సింహ రావు మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహా రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవీఎల్ నర్సింహ రావు మాట్లాడారు.

చదవండి: విశాల్ ఇంటిపై జీఎస్టీ అధికారుల దాడులు, విజయ్ సినిమాపై స్పందించిన తెల్లారే

బిజెపి నేత తీవ్ర విమర్శలు

బిజెపి నేత తీవ్ర విమర్శలు

విజయ్ నటించిన మెర్సెల్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో సినీ తారలపై విమర్శలు చేశారు. భారత సినీ నటుల్లో ఎక్కువ మందికి బుర్ర లేదని, వారికి జనరల్‌ నాలెడ్జ్‌ కూడా తక్కువ అన్నారు.

మంచు విష్ణు ఘాటు స్పందన

మంచు విష్ణు ఘాటు స్పందన

పై వ్యాఖ్యలపై మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. సినీ తారలకు జీకే ఉండదనుకుంటే అప్పుడు రాజకీయ నాయకులంతా అవినీతిపరులు, దోపిడీదారులా? అని ప్రశ్నించారు. మన దేశానికి చెందిన గొప్ప నటులే గొప్ప రాజకీయవేత్తలు అయ్యారన్న విషయం మరువద్దన్నారు.

దానికి జీకే అవసరం లేదు

దానికి జీకే అవసరం లేదు

అలాంటివారిలో స్వర్గీయ ఎన్టీఆర్, ఎంజీఆర్‌, జయలలిత ఉన్నారని మంచు విష్ణు గుర్తు చేశారు. ఒకరి అభిప్రాయం చెప్పడానికి జీకే ఉండాల్సిన అవసరం లేదన్నారు. తాను భారతీయుడినని, క్రైస్తవ యువతిని వివాహం చేసుకున్నప్పటికీ హిందుత్వాన్ని నమ్ముతానని తెలిపారు.

ప్రధాని మోడీ అంటే గౌరవం

ప్రధాని మోడీ అంటే గౌరవం

చివరిగా తాను హిందువునని చెప్పుకోవడానికి గర్వపడతానని మంచు విష్ణు చెప్పారు. అదే సమయంలో బీజేపీపై తనకు గౌరవముందని, ప్రధాని నరేంద్ర మోడీ అంటే అభిమానం ఉందన్నారు.

జీవీఎల్ నర్సింహా రావుపై బాలీవుడ్ నటుడి ఆగ్రహం

జీవీఎల్ నర్సింహా రావుపై బాలీవుడ్ నటుడి ఆగ్రహం

కాగా, జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలపై బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ కూడా స్పందించారు. ఇలాంటి మాటలు మాట్లాడటానికి మీకెంత ధైర్యమంటూ మండిపడ్డారు.

English summary
As if there are no more important issues to take care of, BJP started tackling #Mersal movie like a national calamity. And taking part in a debate about removing GST related dialogues from the Vijay starrer, BJP's national spokesperson GVLN Rao made some strong remarks on film celebs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X