హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ రద్దు బాధగా ఉంది కానీ: మంచు మనోజ్, షాకిచ్చిన నెటిజన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

అసెంబ్లీ రద్దు నిర్ణయం మంచిదే: మంచు మనోజ్

హైదరాబాద్: ప్రముఖ నటుడు మంచు మనోజ్ తెలంగాణ అసెంబ్లీ రద్దు పైన స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కల్వకుంట్ల తారక రామారావుపై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ గురువారం అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మనోజ్ ట్వీట్ చేశారు.

సిగ్గుండాలి, చక్రం తిప్పుతాడట: చంద్రబాబుపై కేసీఆర్ ఘాటుగా, డీఎస్ పైనాసిగ్గుండాలి, చక్రం తిప్పుతాడట: చంద్రబాబుపై కేసీఆర్ ఘాటుగా, డీఎస్ పైనా

మంచు మనోజ్ ట్వీట్

'సంవత్సరాల పోరాటం మరియు స్వయంపాలన త్యాగం. తొలి అసెంబ్లీ రద్దు కావడం కాస్త బాధగానే ఉంది.. కానీ జరిగింది మంచికే. ప్రజల బాగోగులు చూసుకొనేందుకు మీరు మళ్లీ తిరిగి వస్తారని అనుకుంటున్నా. ఈ మార్పుని నమ్మని ప్రతి ఒక్కరి ఆలోచన తప్పు అని మీరు నిరూపించారు. మీకు మరింత శక్తి రావాల'ని ట్వీట్ చేశాడు. కేటీఆర్, కేసీఆర్ ఫోటోలను కూడా పెట్టారు.

గెలిపిస్తే అయిదేళ్లు గ్యారెంటి ఏమిటి


మంచు మనోజ్ చేసిన ట్వీట్‌పై పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి. అయిదేళ్లు పాలించమని ప్రజలు అధికారం ఇస్తే నాలుగున్నరేళ్లకే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారని, ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే అయిదేళ్లు ఉంటారనే గ్యారెంటీ ఏమిటని ఓ నెటిజన్ ప్రశ్నించారు.

ఈ మంచి మనిషికి సపోర్ట్ చేయండి

మరో నెటిజన్ జనసేనకు మద్దతివ్వాలని మంచు మనోజ్‌ను కోరారు. మీ మంచి మనసుతో మంచు వారి కుటుంబం ఈ మంచి మనిషికి సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టారు.

 ఇంకా పొగడ్తలా?

ఇంకా పొగడ్తలా?

తెలంగాణ ప్రజలకు ఏం చెయ్యలేక చేతులెత్తేసిన కేసీఆర్ ప్రభుత్వం వారికి ఇంకా పొగడ్తలు ఏమిటని మరికొందరు విమర్శించారు. మరికొందరేమో కేసీఆర్‌కు మద్దతిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.

English summary
After yrs of fight & sacrifice for self rule, 1st assembly being dissolved is lil disheartening but everything’s for the better.I’m super sure to see u all back to tc of ppl..love u all heartfully! U proved every1 wrong who din’t believe in this change..More power to u.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X