వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పానీపూరీ అమ్మి.. జర్నలిస్ట్‌కు హీరో విష్ణు రూ.22 లక్షల సాయం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ గ్రేట్‌ హీరో అనిపించుకున్నాడు నటుడు మంచువిష్ణు. ప‌క్ష‌వాతానికిగురైన ఓ నిరుపేద జ‌ర్న‌లిస్టు జీవితానికి కొత్త ఆశ‌లు చిగురింప చేశాడు. జ‌ర్న‌లిస్టు దుర్గాగౌడ్‌ హెల్త్ కోసం స‌హాయం చేశాడు.

ఆయ‌న పిల్ల‌లను చ‌దివించేందుకు రూ.22 ల‌క్ష‌లను ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఏడాది కాలంగా ప‌క్ష‌వాతంతో మంచం ప‌ట్టి చావుబ‌తుల‌కుల‌తో పోరాడుతున్న‌ జ‌ర్న‌లిస్టు దుర్గాగౌడ్ క‌ష్టాల‌ను చూపుతూ మేముసైతం కార్య‌క్ర‌మం తెర‌ పైకి తెచ్చింది.

ఈ కార్య‌క్ర‌మంలో అతిథిగా పాల్గొన్నమంచు విష్ణు.. బాధిత జ‌ర్న‌లిస్టు క‌ష్టాల‌ను విని క‌దిలిపోయాడు. ఒక్క
రోజు పానీపూరి అమ్మి త‌న వంతుగా 75,000 రూపాయ‌లు సంపాదించాడు. వాటిని జ‌ర్న‌లిస్టు దుర్గా ఆరోగ్యం కోసం ఇచ్చారు.

 Manchu Vishnu Donates 22Lakhs for Kid in Memu Saitham

ఆయ‌న‌ పిల్ల‌లిద్ద‌రికి న‌ర్స‌రీ నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు కార్పోరేట్ విద్య అందించేందుకు 22 ల‌క్ష‌ల ఇస్తానని చెప్పాడు. దీంతో విష్ణు పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజ జీవితంలోనూ గ్రేట్ హీరో అనిపించుకున్న మంచు విష్ణుకు జ‌ర్న‌లిస్టులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

మంచుల‌క్ష్మి కూడా త‌న‌వంతుగా ల‌క్ష రూపాయ‌ల సహాయం ప్ర‌క‌టించింది. మొత్తం 1 ల‌క్షా 75 వేల రూపాయల చెక్కును దుర్గాగౌడ్ కుటుంబానికి అందించారు.

అంటే దాదాపుగా 24 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ సహాయం అందించిన మంచు విష్ణు, మంచు ల‌క్ష్మిల‌కు హ్యాట్సాప్ చెబుతున్నారు. దొంగాట మూవీ డైరెక్ట‌ర్ వంశీకృష్ణ‌కు జర్నలిస్డటులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జ‌ర్న‌లిస్టు దుర్గా జీవితానికి భ‌రోసా అందించేందుకు స‌హాయ ప‌డుతున్న ప్ర‌తి ఒక్క‌రికి స్వామి ముద్దం కృతజ్ఞతలు చెప్పారు.

English summary
The Manchu family is known for their generosity even though they have proved to be eccentric several times. And that generosity came to the fore when Vishnu was in the Memu Saitam programme recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X