వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందకృష్ణ సంచలనం: ఏపీలో తనపై హత్య కుట్ర?, కార్లు వెంబడిస్తున్నాయ్..

దేశవ్యాప్తంగా 10రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ పనిచేస్తోందని, మిగతా రాష్ట్రాల్లో స్వేచ్చగా తిరుగుతున్న తనను ఏపీలో మాత్రం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన కురుక్షేత్ర మహాసభను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట తప్పి.. వర్గీకరణ విషయంలో చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ ఆరోపిస్తోంది.

<strong>కురుక్షేత్ర సభకు అనుమతి లేదు, గుంటూరులో రావెల ఫ్లెక్సీల కలకలం</strong>కురుక్షేత్ర సభకు అనుమతి లేదు, గుంటూరులో రావెల ఫ్లెక్సీల కలకలం

ఈ వ్యవహారంపై తాజాగా మందకృష్ణ వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో తనకు రక్షణ లేకుండా పోయిందని, తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయన్నారు. తాను ఎక్కడికెళ్లినా.. కొన్ని కార్లు తనను వెంబడిస్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 10రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ పనిచేస్తోందని, మిగతా రాష్ట్రాల్లో స్వేచ్చగా తిరుగుతున్న తనను ఏపీలో మాత్రం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

 manda krishna madiga allegations on conspiracy behind him

కురుక్షేత్ర సభ జరగకుండా అక్కడి మాదిగ ఎమ్మెల్యేలను ప్రభుత్వం బెదిరించిందని ఆరోపించారు. స్వేచ్చతో పాటు, రక్షణ కూడా కరువైన చోట.. తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పుకొచ్చారు. తనను కార్లు వెంబడిస్తున్న విషయం, ఏపీలో తనపై జరుగుతున్న కుట్ర తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఉండదని, కాబట్టి సీఎం కేసీఆర్ దీన్ని 24గం.ల్లో తేల్చాలని డిమాండ్ చేశారు.

నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, వర్గీకరణ చేస్తామన్నారు కాబట్టే ఇరు రాష్ట్రాల సీఎంలతోను కలిసి పనిచేశామని మందకృష్ణ అన్నారు. చంద్రబాబు లాంటి వారు మరో 100మంది వచ్చినా ఎమ్మార్పీఎస్ ఎదుర్కొంటుందని తేల్చి చెప్పారు.

English summary
MRPS Founder Manda Krishna alleged that some one trying to murder him. He said some unidentifying cars are hunting him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X