వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఆరోగ్యంపై మాండమాస్ పిటిషన్.. హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్ మల్లన్న

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోండగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి సంబంధించిన ఘటనలు పెరుగుతుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే #whereiskcr హ్యాష్ ట్యాగ్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ జర్నలిస్టు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మరో అడుగుముందుకేసి #kcrmissing అంటూ కొత్త అనుమాలను లేవనెత్తారు. మరోవైపు..

సీఎం కేసీఆర్ మిస్సింగ్: స్ట్రాటజీ ఇదేనా.. ఫామ్‌హౌజ్‌లో సీఎంవో సెటప్.. వైరస్ తగ్గేదాకా అక్కడే?సీఎం కేసీఆర్ మిస్సింగ్: స్ట్రాటజీ ఇదేనా.. ఫామ్‌హౌజ్‌లో సీఎంవో సెటప్.. వైరస్ తగ్గేదాకా అక్కడే?

సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆయనిప్పుడు ఏం చేస్తున్నారనే వివరాలను ప్రభుత్వమే వెల్లడించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తీన్మార్ మల్లన్న బుధవారం హైకోర్టులో మాండమస్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్‌లో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందనీ... అప్పటి నుంచీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి వెళ్లారని మల్లన్న తన పిటిషన్‌లో గుర్తుచేశారు.

Mandamus petition filed in Telangana HC over KCR’s health by teenmar mallanna

సీఎం అందుబాటులో లేకుండాపోయేసరికి వివిధ శాఖల అధికారులు సక్రమంగా పనిచేయడంలేదని, దీంతో ప్రజల్లో కరోనా భయాలు మరింతగా పెరిగిపోతున్నాయని, అన్నింటికీ సమాధానంగా కేసీఆర్ పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే స్పందించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. పిటిషన్ దాఖలైన బుధవారం నాడే.. కేసీఆర్ కు సంబంధించి మరికొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. కరోనా ప్రభావం తగ్గేంతవరకు సీఎం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌజ్ కే పరిమితమవుతారని, అక్కడి నుంచి విధులు నిర్వహించేలా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది.

English summary
On Wednesday, a Mandamus petition was filed in the Telangana High Court expressing concern over the health of the Chief Minister. The petitioner, Naveen alias teenmar mallanna, sought to know through the court the health condition of the CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X