వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక్కడ లేకుండాచేస్తా: కేసీఆర్‌కి మందకృష్ణ వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిథ్యం లభించేవరకు పోరాడుతానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ శుక్రవారం అన్నారు.

తెలంగాణలోని రెండు కోట్ల మంది మహిళల గొంతునై ఉద్యమిస్తానని చెప్పారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించకుండా, వారి సమర్థతను, ఆత్మాభిమానాన్ని కేసీఆర్ అవమానించారన్నారు.

మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిథ్యం కల్పించనందుకు నిరసనగా ధర్నా చౌక్‌లో ఎమ్మార్పీఎస్ మహిళా గర్జన నిర్వహించింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. లింగ వివక్ష చూపించి, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదన్నారు.

ఎమ్మార్పీఎస్

ఎమ్మార్పీఎస్

మంత్రి వర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకుంటే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఇప్పటికైనా మహిళలకు ప్రాతిధ్యం కల్పించకపోతే కేసీఆర్‌ను ఈ గడ్డపై లేకుండా చేస్తామని హెచ్చరించారు.

ఎమ్మార్పీఎస్

ఎమ్మార్పీఎస్

తెలంగాణ ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా సీఎం, మంత్రులు, సంబరాలు చేసుకుంటుండగా ప్రభుత్వం చేతిలో దగాపడిన, మోసపోయిన మహిళలు, దళితులు నిరసన తెలపాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.

ఎమ్మార్పీఎస్

ఎమ్మార్పీఎస్

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని దళితుడినే చేస్తానని చెప్పి చెయ్యకుండా ఒకసారి, మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా మరోసారి సీఎం కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. ఈ మోసాలకు నిరసనగానే మహిళా గర్జన చేపట్టామని ప్రకటించారు.

ఎమ్మార్పీఎస్

ఎమ్మార్పీఎస్

మంత్రివర్గంలో మహిళలకు ఇప్పటికైనా చోటు కల్పించకుంటే టీఆర్‌ఎస్‌ను ఈ గడ్డ మీద లేకుండా చేస్తామని హెచ్చరించారు. 60 ఏళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో మహిళలు మంత్రివర్గంలో లేని ప్రభుత్వమే లేదని, ఒక్క కేసీఆర్‌ ప్రభుత్వంలో తొలిసారి మహిళలకు తీరని అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఎమ్మార్పీఎస్

ఎమ్మార్పీఎస్

తెలంగాణ ద్రోహుల పార్టీ అని ముద్రవేసిన టీడీపీ నుంచి గెలిచిన, గెలవని తలసాని, తుమ్మలకు మంత్రి పదవులిచ్చారని, ద్రోహులకు తప్ప మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఉండదా అని నిలదీశారు.

ఎమ్మార్పీఎస్

ఎమ్మార్పీఎస్

టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తానని చెప్పడంతో పాటు మహిళల కోసం 17 అంశాల్లో చేర్చారని, వీటిలో ఒక్కటైనా అమలు చేశారా? అని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క తెలంగాణ నుంచే ఆరుగురు మహిళలు మంత్రివర్గంలో ఉన్నవిషయాన్ని గుర్తు చేశారు.

ఎమ్మార్పీఎస్

ఎమ్మార్పీఎస్

కుమార్తెకు కేంద్ర మంత్రిపదవి కోసం బీజేపీతో సంప్రదింపులు చేస్తున్న సీఎంకు తెలంగాణలో 2 కోట్ల మంది మహిళలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుత హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కంటే హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఎంతో సమర్థంగా పని చేశారని గుర్తు చేశారు.

 ఎమ్మార్పీఎస్

ఎమ్మార్పీఎస్

కేటీఆర్‌, తుమ్మల ఎవరి శాఖలు వారే చూసుకుంటున్నారని, మహిళా శిశు సంక్షేమ శాఖ తుమ్మలకిస్తే ఒక్కసారైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. మహిళల ప్రాతినిధ్యం లేని దేశం బాగుపడదని చెప్పే కేసీఆర్, మహిళా మంత్రులు లేకుండా తెలంగాణ బాగుపడుతుందా అని ప్రశ్నించారు.

English summary
Mandar Krishna warns CM KCR in MRPS Mahila Garjana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X