వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్: 26 రకాల రుచులు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల రుచులు ఊరిస్తూ ఉంటాయి. మామిడిపండ్ల రసాలు జుర్రుకోవాలని తాపత్రయపడడం సాధారం. ఆ రుచులను వద్దనే వారుండరు. అయితే, దానికి మరిన్ని రుచులు అద్ది అందించడానికి హైదరాబాదులోని గోల్కొండ హోటల్ వారు పునుకున్నారు.

కింగ్ ఆఫ్ ది ఫ్రూట్‌గా కూడా మామిడి పండుకు పేరుంది. మ్యాంగో పలు రకాల వంటకాల రూపంలో భోజన ప్రియులను ఊరిస్తోంది. గోల్కొండ హోటల్‌లో ద గో మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్ పేరుతో 26 రూపాల్లో మామిడితో రుచికరమైన వంటకాలను, జ్యూస్‌లను, స్టార్టర్స్‌ను సిద్ధం చేశారు.

శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాంగో ఫెస్టివల్ మే 29 వరకు కొనసాగుతుందని, అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ మామిడి విందును ఆరగించవచ్చని గోల్కొండ హోటల్ ఫుడ్ అండ్ బేవరేజ్ మేనేజర్ రాజేష్ ప్రకటించారు.

పలు రకాలు...

పలు రకాలు...

గోల్కొండ హోటల్ వారి మ్యాంగో ఆఫర్‌లో పలురకాల మామిడి ఫలాలను ఉపయోగించి స్టార్టర్స్, నాన్‌వెజ్ ఐటమ్స్, సూప్, వెజిటబుల్ కర్రీస్, జ్యూస్‌ని అందిస్తున్నామని రాజేష్ చెప్పారు.

ఇలా పల్లెంలో...

ఇలా పల్లెంలో...

గోల్కోండ హోటల్ మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్‌ో ఓ పదార్థం భోజన ప్రియులను ఊరిస్తూ ఇలా కనిపిస్తోంది..

ఇలా అందిస్తాం...

ఇలా అందిస్తాం...

మ్యాంగో ఫుడ్ వంటకాలను ఇలా రుచికరంగా అందిస్తామని గోల్కొండ హోటల్ వారు చూపిస్తున్నారు. నోరూరడం లేదా...

రసాలు పిండుకుంటాం...

రసాలు పిండుకుంటాం...

భోజనం ముగిసిన తర్వాత మామిడిపండ్ల రసాలు పిండుకుని చివరలో తినడం మనకు అలవాటు. బహుశా అలాగే అనుకుందామా...

మామిడి రసంతో ఘనాలు కూడానా...

మామిడి రసంతో ఘనాలు కూడానా...

మామిడి పండ్ల రసాన్ని జుర్రుకోవడం మనకు అలవాటు. లేదా భోజనంలో కలుపుకుని తినడం అలవాటు.. ఇలా ఘనపదార్థం చేసుకుని కూడా తినవచ్చునా...

ఇలా కూడా...

ఇలా కూడా...

మామిడిపండ్ల రసం అంటేనే నోరూరూతుంది. జిహ్వ చాపల్యాన్ని తీర్చుకోవడానికి మామిడిపండ్ల పదార్థం ఇలా కూడా ఉంటుది.

English summary
Golkonda hotel in Hyderabad has organised Mango Food festival for the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X