హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎండి పోయిన మంజీరా, సింగూరు జలాశ‌యాలు..! జంట‌న‌గ‌రాల్లో తాగునీటికి కటకట..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎండాకాలం ఎండ‌ల మంట తో పాటు త్రాగునీటికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. న‌గర ప్ర‌జ‌ల గొంతు త‌డిపే సింగూరు జ‌లాలు అడుగంట‌డ‌మే ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది. మ‌రో ప‌క్క మంజీరా జ‌లాలు కూడా అంతంత మాత్ర‌మే అందుతుండ‌డంతో సింగూరు జ‌లాల‌పై ఆధార‌ప‌డిన జంట‌న‌గ‌ర వాసుల‌కు గొంతు ఎండిపోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌త్యామ్నాయం కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న అదికారులు వ‌చ్చే ఎండాకాలం నీటి విష‌యంలో న‌గ‌ర వాసులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పుకురావ‌డం విశేషం.

అడుగంటిన జ‌లాశ‌యాలు..! త్రాగు నీటికి క‌ష్టాకాల‌మే..!!

అడుగంటిన జ‌లాశ‌యాలు..! త్రాగు నీటికి క‌ష్టాకాల‌మే..!!

జంటనగరాలలో మంజీరా జలాలకు కటకట ఏర్పడింది. మంజీరా రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడం, సింగూరు ప్రాజెక్టు అడుగంటడంతో హైదరాబాద్లో చాలా ప్రాంతాలపై ఆ ప్రభావం పడింది. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రక్షణ శాఖ పరిశ్రమలకు కూడా మంజీరా నీళ్ల సరఫరా ఆగిపోయింది. 1981 నుంచి బీడీఎల్‌కు మంజీరా నీటిని అందిస్తున్నారు. ఇక్కడ దేశ రక్షణకు కావాల్సిన మిసైళ్లకు రూపకల్పన చేస్తారు. గతంలో పలు మిసైళ్లకు ఇక్కడే అభివృద్ధి చేశారు. ఈ రక్షణ సంస్థకు నీటి అవసరం ఎంతో ఉంటుంది.

 ర‌క్ష‌ణ శాఖ ప‌రిశ్ర‌మ‌ల‌కు నీటి స‌ర‌ఫ‌రా బంద్..! ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న సిబ్బంది..!!

ర‌క్ష‌ణ శాఖ ప‌రిశ్ర‌మ‌ల‌కు నీటి స‌ర‌ఫ‌రా బంద్..! ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న సిబ్బంది..!!

శాస్త్రవేత్తలు ఇతర ఉద్యోగులు, సిబ్బంది కలిపి దాదాపు 1,500 కుటుంబాలు ఉన్నాయి. ఫ్యాక్టరీతోపాటు ఆ కుటుంబాలకు రోజూ 10 లక్షల కిలోలీటర్ల నీరు అవసరం. మరో రక్షణ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీదీ అదే పరిస్థితి. యుద్ధ రంగంలో వాడే ట్యాంకర్లను ఇక్కడ తయారు చేస్తారు. 2003 నుంచి జలమండలి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి తాగునీటిని అందిస్తోంది. నిత్యం 5,455 కిలో లీటర్ల మంజీరా జలాలను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సంస్థలకు ఒక్కసారిగా సరఫరా నిలిపివేయడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా చెల్లె నమ్మింది.. హైదరాబాద్ అన్న మోసం చేసిండు.. కోటిన్నర మాయం..!అమెరికా చెల్లె నమ్మింది.. హైదరాబాద్ అన్న మోసం చేసిండు.. కోటిన్నర మాయం..!

 రిజ‌ర్వాయ‌ర్లు ఎండిపోవ‌డంతో నీటి క‌ట‌క‌ట‌..! చాలి చాల‌ని క్రిష్ణ‌, గోదావ‌రి జ‌లాలు..!!

రిజ‌ర్వాయ‌ర్లు ఎండిపోవ‌డంతో నీటి క‌ట‌క‌ట‌..! చాలి చాల‌ని క్రిష్ణ‌, గోదావ‌రి జ‌లాలు..!!

ఒక్కసారిగా మంజీరా, సింగూరు జలాలు బంద్ చేయడంతో ఆ ప్రభావం నగరంలో చాలా ప్రాంతాలపై కనిపిస్తోంది. గతంలో ఈ రెండు జలాశయాల నుంచి నిత్యం 120 ఎంజీడీలు సరఫరా చేసేవారు. రిజర్వాయర్ల నుంచి ప్రస్తుతం చుక్క నీరు రావడం లేదు. కృష్ణా, గోదావరి, జంట జలాశయాల నుంచి తరలిస్తు న్నా ఎటూ సరిపోవడం లేదు న‌గ‌ర వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌త్యామ్న‌యాల‌పై ద్రుష్టి పెట్టాలంటున్న ప్ర‌జ‌లు..! ఇబ్బంది రానివ్వం అంటున్న అదికారులు..!!

ప్ర‌త్యామ్న‌యాల‌పై ద్రుష్టి పెట్టాలంటున్న ప్ర‌జ‌లు..! ఇబ్బంది రానివ్వం అంటున్న అదికారులు..!!

అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. శివార్లతోపాటు ప్రధా న నగరంలో నీటి సరఫరా సక్రమంగా సాగడం లేదు. గతంలో గంటకు పైగా సరఫరా జరిగితే కొన్ని ప్రాంతాల్లో 20- నిమిషాల పాటు సరఫరా తగ్గిం చేశారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి అధికారులు స్పందించి వెంటనే కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని కోరుతున్నారు. ప‌రిస్తితి ఇలాగే కొన‌సాగితే వేస‌విలో ఎలా త‌ట్టుకోవ‌డ‌మ‌ని జంట‌న‌గ‌ర వాసులు అయోమ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
In the twin towns drinking water scarsity coming up. The Manjira Reservoir was completely dry, and the Singur project water was affected by many areas in Hyderabad. Manjira water supplies have also been stopped for the prestigious defense industries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X