• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మారుతీరావు ఎఫెక్ట్: ‘ఎంత చెప్పినా వినలేదు, అందుకే కసాయిలా మారా!’: మనోహరాచారి పశ్చాత్తాపం

|

హైదరాబాద్: బంధువులు, కుటుంబసభ్యుల ఒత్తిడి, మద్యం మత్తులో క్షణికావేశంతోనే ప్రేమ పెళ్లి చేసుకున్న తన కూతురు, అల్లుడిపై కత్తితో దాడి చేశానని మనోహరాచారి వెల్లడించాడు. అయితే, తాను ప్రసుత్తం కుమిలిపోతున్నట్లు ఇటీవల ఎర్రగడ్డలో కన్న కూతురు మాధవి, అల్లుడు సందీప్‌పై కత్తితో దాడి చేసిన మనోహరాచారి పోలీసుల విచారణలో తెలిపాడు.

మనోహారాచారిపై ఎస్సీఎస్టీ కేసు

మనోహారాచారిపై ఎస్సీఎస్టీ కేసు

ఆసుపత్రి పాలైన కూతుర్ని చూడాలని ఉందంటూ అతడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రేమ పెళ్లి చేసుకున్న తన కూతురు మాధవి, అల్లుడు సందీప్‌లపై సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం నడి రోడ్డుపై మనోహరచారి కొబ్బరి బోండాల కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.దాడి అనంతరం ఖైరతాబాద్‌ సమీపంలోని తన బావమరిది ఇంట్లో ఆశ్రయం పొందిన మనోహరచారిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.

బంధువులే రెచ్చగొట్టారు.. అందుకే కసాయిలా

బంధువులే రెచ్చగొట్టారు.. అందుకే కసాయిలా

కాగా ఈ కేసులో లోతైన విచారణ కోసం నిందితుడిని మూడు రోజుల పాటు ఎస్సార్‌నగర్‌ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. తన కూతురు కూలాంతర ప్రేమ పెళ్లి చేసుకోవడంతో బంధువులు సూటి, పోటి మాటలతో రెచ్చగొట్టారని, ఆ కసితోనే కసాయిలా మారి కూతురిపై కత్తితో దాడి చేశానని విచారణలో మనోహరచారి వెల్లడించినట్లు తెలిసింది.

నా కూతురుపై అందుకే దాడి చేశా, ఆవేశంలోనే..: మనోహారాచారి, ‘కూతురే టార్గెట్- ఇప్పుడు బాధపడితే'

 టార్గెట్ కూతురే కానీ..

టార్గెట్ కూతురే కానీ..

ప్రేమ పెళ్లి చేసుకున్న తన కూతురిని ఎంత బతిమిలాడినా ఇంటికి రాలేదని, దీంతో తన కోపం మరింత పెరిగిందని వెల్లడించినట్లు సమాచారం. బంధువుల మాటలు, కూతురిపై కోపంతోనే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాని, అయితే సంఘటనా స్థలానికి అల్లుడు కూడా రావడంతో ఇద్దరిపై దాడి చేశానని తెలిపాడు. తాను చేసిన తప్పునకు చింతిస్తున్నానని, ఆసుపత్రిలో ఉన్న కూతుర్ని చూడాలని ఉన్నా.. తాను చేసిన నేరం కట్టిపడేసిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

 మారుతీరావు ప్రభావం

మారుతీరావు ప్రభావం

సందీప్‌ను వదిలిపెట్టి ఇంటికి రావాలని పదే పదే కోరినా మాధవి రాలేదని, ఇదే సమయంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్య సంఘటన తనలో మరింత ఆగ్రహన్ని తెప్పించిందని మనోహరాచారి విచారణలో అంగీకరించాడు. అయితే ప్రణయ్‌ను హత్య చేసిన విధంగా కాకుండా తన కూతురు మాధవినే హతమార్చాలని నిర్ణయానికి వచ్చానని చెప్పాడు. 19న ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి నేరుగా అమీర్‌పేటలోని వైన్స్‌షాపుకు వెళ్లి బాగా మద్యం సేవించి మాధవికి ఫోన్‌ చేసి బట్టలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కదానివే ఎర్రగడ్డకు రావాలని తెలిపానన్నాడు. మార్గ మధ్యంలో ప్రైమ్‌ ఆసుపత్రి సమీపంలో కొబ్బరి బొండాల బండి వద్దకు వెళ్లి కత్తిని దొంగిలించి ఎర్రగడ్డకు వచ్చానని తెలిపాడు. అప్పటికే సందీప్, మాధవిలు అక్కడకు కలిసి రావడంతో ముందుగా సందీప్‌పై దాడిచేస్తే పారిపోతాడని భావించి అతడిపై కత్తితో దాడి చేశానని పేర్కొన్నాడు. మద్యం మత్తులో కసాయిగా మారి అల్లారు ముద్దుగా కనిపెంచిన కుమార్తెని చేతులతోనే దాడి చేశానని వాపోయాడు.

  ఎర్రగడ్డ కూతురుపై దాడిలో కొత్త కోణం: పరువు కోసం కాదు, అందుకే సందీప్‌పై తొలుత దాడి

  English summary
  Manohara Chary says reason about attack madhavi and her husband.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X