• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాజకీయ బద్ధ శత్రువులు.. గురువు, మాజీ శిష్యుడు.. ఒకే స్టేజీ మీద దర్శనం, టెన్షన్ సీన్..!

|

మంథని : ఒకనాడు గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. ఆపై గురువుని మించిన శిష్యుడిగా ఎదిగారు. ఆ తర్వాత రాజకీయ శత్రువుగా మారారు. ఇప్పుడేమో ఎదురుపడితే ఒకరికొకరు పలకరించుకోలేని పరిస్థితి. మంథని రాజకీయాల్లో ఆ గురుశిష్యుల బంధం గురించి స్థానికులకు బాగా తెలుసు. ఆనాడు హవా నడిపించిన గురువుకు నమ్మకస్తుడిగా ఉంటూ ఆ తర్వాత గురువు స్థానం ఆక్రమించిన శిష్యుడు.. ఆ ఇద్దరి నేపథ్యం అక్కడి జనాలకు సుపరిచితమే.

అందులో గురువు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాగా.. శిష్యుడేమో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు. అయితే ప్రజోపయోగ కార్యక్రమంలో భాగంగా ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకే వేదికను పంచుకోవడం హాట్ టాపికైంది. కొంత టెన్షన్ కూడా క్రియేట్ చేసింది. చివరకు అంతా సవ్యంగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 శ్రీధర్ బాబు వర్సెస్ పుట్ట మధు

శ్రీధర్ బాబు వర్సెస్ పుట్ట మధు

మంథని రాజకీయ చరిత్రలో ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పేజీలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీపాదరావు తనయుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొలిటికల్ కెరీర్‌ను పదిలం చేసుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో పుట్ట మధు ఆయనకు ప్రధాన అనుచరుడిగా, నమ్మకస్తుడిగా ముద్రపడ్డారు. ఎంతలా అంటే ఒకానొక దశలో పుట్ట మధు లేకుండా శ్రీధర్ బాబు బయటకు వెళ్లలేని పరిస్థితి అన్నమాట.

ఏపీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కూడా రాజకీయాలు.. చీరాలలో కొట్టుకున్న వైసీపీ, టీడీపీ నేతలు

గురువును మించిన శిష్యుడిగా..!

గురువును మించిన శిష్యుడిగా..!

అయితే ఎన్నాళ్లు శిష్యరికం చేయాలనుకున్నారో ఏమో గానీ పుట్ట మధు తాను లీడర్‌గా ఎదగాలనుకున్నారు. అసెంబ్లీలో అధ్యక్షా అని గొంతు చించుకునే ఛాన్స్ కోసం వెయిట్ చేశారు. ఆ ఛాన్స్ రావడానికి ఆయనకు ఎంతోకాలం పట్టలేదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాలం కలిసిరావడంతో 2014లో టీఆర్ఎస్ నుంచి సునాయాసంగా ఎమ్మెల్యేగా గెలిచారు. అలా గురువును మించిన శిష్యుడిగా ఎదిగారు. అయితే మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా కారు జోరు కనిపించినా.. మంథనిలో మాత్రం సీన్ రివర్సైంది. మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

రాజకీయమా.. మజాకా?

రాజకీయమా.. మజాకా?

శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పుట్ట మధు రాజకీయ జీవితం ప్రశ్నార్థకం కాకుండా సీఎం కేసీఆర్ మరో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన జడ్పీ ఎన్నికల్లో ఆయనకు ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక్కడే మంథని రాజకీయాలు తిరకాసుగా మారాయి. గురువేమో ఎమ్మెల్యే, మాజీ శిష్యుడేమో జడ్పీ ఛైర్మన్.. ఇలా ఇద్దరి మధ్య వార్ కని కనిపించకుండానే ముదురుతోంది.

ఆ క్రమంలో ఇటీవల వారిద్దరు ఎక్కడా తారసపడ్డా.. ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. బుధవారం నాడు మంథనిలో ఇలాంటి సన్నివేశమే కనిపించింది. సింగరేణికి సంబంధించిన ఆర్జీ - 3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది. మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు.

 ఒకే స్టేజీ.. ఇద్దరు నేతలు.. అంతా టెన్షన్ టెన్షన్..!

ఒకే స్టేజీ.. ఇద్దరు నేతలు.. అంతా టెన్షన్ టెన్షన్..!

హరితహారం విజయవంతం చేయడానికి అందరూ కంకణం కట్టుకున్నారు. ఆ క్రమంలో బొక్కలవాగు కరకట్టపై మొక్కలు నాటారు. అనంతరం హరితహారం కార్యక్రమానికి సంబంధించి సభ ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ శత్రువులుగా మారిన గురువు శ్రీధర్ బాబు, మాజీ శిష్యుడు పుట్ట మధు ఒకే వేదికను పంచుకోవడం చర్చానీయాంశమైంది. ప్రజోపయోగ కార్యక్రమం కాబట్టి ఆ ఇద్దరు అక్కడికి రాక తప్పలేదు. ఆ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తలు తమ నేతలకు అనుగుణంగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

నో టికెట్, ఫ్రీ జర్నీ.. మెట్రోలో, బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రాఖీ కానుక..!

ప్రొటోకాల్‌పై రచ్చ జరిగేదే.. కానీ..!

ప్రొటోకాల్‌పై రచ్చ జరిగేదే.. కానీ..!

అదలావుంటే ఎమ్మెల్యే హోదాలో శ్రీధర్ బాబు లెవనెత్తిన అంశం హాట్ టాపికైంది. సింగరేణి అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని ఆరోపించారు. దానికి పుట్ట మధు సమాధానమిస్తూ మున్సిపాలిటీ పరిధిలో ప్రొటోకాల్ లేదని స్పష్టం చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు. మొత్తానికి ఇద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్న వేళ.. అభివృద్ది కార్యక్రమాల తంతు సవ్యంగా ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

English summary
Manthani ZP Chairman, Ex MLA Putta Madhu is follower of Present MLA Sridhar Babu once upon a time. Later, Putta Madhu elected as MLA. They later became a political enemies. It is a situation that cannot be greeted with each other. In that way, they both shared a stage while in Haritha Haram Programme while create tense situation. At last there is no issue, the officials feel happy beeing all is well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X