వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గౌతమీపుత్ర శాతకర్ణి' అంతా అబద్దం: తెలంగాణ లీడర్స్ ఆగ్రహం

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో చాలా అవాస్తవాలు ఉన్నాయని తెలంగాణ అసోసియేషన్ నాయకులు, పలువురు చరిత్రకారులు చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ-శ్రియ నటీనటులుగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో చాలా అవాస్తవాలు ఉన్నాయని తెలంగాణ అసోసియేషన్ నాయకులు, పలువురు చరిత్రకారులు చెబుతున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి - కొత్త కోణం: 'అసలు'పై చర్చగౌతమీపుత్ర శాతకర్ణి - కొత్త కోణం: 'అసలు'పై చర్చ

చారిత్రక అబద్దం

చారిత్రక అబద్దం

కెప్టెన్ పాండురంగా రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఈ సినిమా ఓ చారిత్రక అబద్దం అని విమర్శించారు. అవాస్తవాలతో సినిమాలు తీయడం సరికాదన్నారు.

అవాస్తవాలతో సినిమా

అవాస్తవాలతో సినిమా

అవాస్తవాలతో సినిమా తీశారని కాబట్టి ఈ సినిమాకు ఇచ్చిన వినోదపు పన్ను మినహాయింపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది హిస్టారికల్ సినిమా అని వారు చెప్పుకోవచ్చునని, కానీ ఆ సినిమా కల్పితమని చెప్పారు. శాతకర్ణి చారిత్రక అబద్దమని, అవాస్తవాలు, కల్పిత కథతో చిత్రాన్ని తెరకెక్కించారన్నారు.

ఆగ్రహం

ఆగ్రహం

కెప్టెన్‌ ఎల్‌ పాండురంగారెడ్డి (వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు), హైదరాబాద్‌ డక్కెన్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కొల్లూరి చిరంజీవి, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ప్రతినిధి డీపీ రెడ్డిలు హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త తరానికి అవాస్తవాలు

కొత్త తరానికి అవాస్తవాలు

గౌతమిపుత్రుని చరిత్ర గురించి కొత్త తరానికి అవాస్తవాలు చెప్పారని మండిపడ్డారు. శాతకర్ణి అసలు కోటి లింగాలలో పుట్టనేలేదని, ఆయన తల్లి బాలాశ్రీ వేయించిన శాసనాల్లో ఈ విషయం లేదని వాళ్లు చెబుతున్నారు.

తెలంగాణ వ్యక్తి కాదు

తెలంగాణ వ్యక్తి కాదు

కేవలం దక్కన్ పీఠభూమిని మాత్రమే పాలించిన శాతకర్ణి, దేశమంతటినీ పాలించినట్టు ఎలా చూపెడతారని నిలదీస్తున్నారు. శాతకర్ణి తెలంగాణ వ్యక్తి కాదని చెప్పారు. సినిమాలో ఎన్నో అవాస్తవాలు చెప్పారన్నారు.

English summary
Leaders of Telangana associations, including historians, have found fault with the Telangana government’s decision to waive entertainment tax for a historically inaccurate movie like Gautamiputra Satakarni.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X