వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టు మరో అగ్రనేత కిరణ్ అరెస్టు?

By Pratap
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: మరో మావోయిస్టు అగ్రనేత కిరణ్ పోలీసులకు చిక్కినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవలికాలంలో కెకెడబ్ల్యు (ఖమ్మం, కరీంనగర్, వరంగల్)లో ఉనికిని చాటుకుంటున్న మావోయిస్టులకు ఇది మరో ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్ మరిచిపోకముందే, ఆ పార్టీకి చెందిన మరో అగ్రనేత పోలీసులకు చిక్కాడం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం కెకెడబ్ల్యు కార్యదర్శి దామోదర్‌కు ప్రధాన అనుచరుడిగా, మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న కిరణ్ పోలీసులకు పట్టుబడ్డాడు. హిమోగ్లోబిన్ లోపంతో అనారోగ్యం పాలై చికిత్స చేయించుకొని వెళ్తున్న క్రమంలో ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా సరిహద్దులోని చత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

Maoist leader Kiran alias Shiva Reddy has been nabbed in Khammam district

అరెస్ట్‌ను నిర్థారిస్తూ విప్లవ సంఘాలు కిరణ్‌ను కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన కిరణ్ అలియాస్ శివారెడ్డి సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. కెకెడబ్ల్యులో ప్రధాన నాయకుడిగా, వ్యూహకర్తగా పేరొందారు.

ఇటీవలికాలంలో ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం ప్రాంతాల్లో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జరిగిన అనేక కార్యక్రమాలకు ఆయన నాయకత్వం వహించారు. కాగా, హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్న కిరణ్‌కు పోలీసులు రక్తదానం చేసి ఆయన ఆరోగ్యం మెరుగుపడేందుకు సహకరించినట్టు తెలిసింది.

English summary
According to media reports - Maoist leader Kiran alias Shiva Reddy has been nabbed in Khammam district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X