వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో మళ్ళీ మావోల అలజడి .. పోలీసుల కూంబింగ్ తో ఉలిక్కిపడుతున్న ఏజెన్సీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. బడే చొక్కా రావు ఆధ్వర్యంలో మావోయిస్టుల బృందం సంచరిస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రవేశించినట్టు భావిస్తున్న పోలీసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అనుమానితుల ఫోటో లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. దీంతో ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ప్రజలు మళ్లీ భయం గుప్పిట్లో జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు.

 గతంలో ఆదిలాబాద్ జిల్లాలో రిక్రూట్ మెంట్స్.. భాస్కర్ ఆధ్వర్యంలో మావోల బృందం అలజడి

గతంలో ఆదిలాబాద్ జిల్లాలో రిక్రూట్ మెంట్స్.. భాస్కర్ ఆధ్వర్యంలో మావోల బృందం అలజడి


గతంలో కూడా మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడం కోసం ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య పలు సందర్భాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. తిర్యానీ అడవుల్లో అనేక మార్లు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్, కొయ్యాడ సాంబయ్య, కంకణాల రాజిరెడ్డి లు రిక్రూట్మెంట్ చేస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టు కార్యకలాపాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రవేశించిన మావోలు

బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రవేశించిన మావోలు

అప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా పరిస్థితులను పరిశీలించారు.

ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో మావోయిస్టు కమిటీ సభ్యులు తిరుగుతున్నారని సమాచారంతో పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. తాజాగా డీజీపీ మహేందర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన ఈ నేపథ్యంలో ఆసక్తిని సంతరించుకుంది. మావోయిస్టు పార్టీ సభ్యులు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో కురసం మంగు అలియాస్ బద్రు , కొవ్యా సి గంగ అలియాస్ మహేష్ , పాండు మంగులు, బూర రాజేష్ అలియాస్ శివ, యాతం నరేంద్ర అలియాస్ సంపత్ ల బృందం భద్రాద్రి అటవీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు సమాచారం.

మావోల అలజడితో తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజీపీ పర్యటన

మావోల అలజడితో తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజీపీ పర్యటన

అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన డీజీపీ మహేందర్ రెడ్డి, మావోయిస్టు కార్యకలాపాలపై జిల్లా ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది. ఎట్ల ఆచూకి చెప్పినవారికి బహుమతి కూడా ఇస్తామంటూ ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.

రెండు మూడు నెలల క్రితం చత్తీస్ ఘడ్ నుండి తెలంగాణ రాష్ట్రంలోని ప్రవేశించిన మావోయిస్టులు ఏటూరునాగారం ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఇలా తెలంగాణ సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాలలో అలజడి సృష్టించారు.

గతంలో టీఆర్ఎస్ నాయకుడిని హతమార్చి ఉనికి చాటే ప్రయత్నం చేసిన మావోలు

గతంలో టీఆర్ఎస్ నాయకుడిని హతమార్చి ఉనికి చాటే ప్రయత్నం చేసిన మావోలు

ములుగు జిల్లా కు సంబంధించిన టిఆర్ఎస్ నాయకుడిని హతమార్చారు. తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలకు, సీఎం కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు. పలుచోట్ల టిఫిన్ బాంబులు పేల్చారు. ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోమారు తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు ప్రవేశించారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎలాంటి చర్యలకు పాల్పడతారు , పోలీసులు ఏం చేయబోతున్నారు అన్నది ఏజెన్సీలో చర్చనీయాంశంగా మారింది.

English summary
The movements of the Maoists have started once again in the state of Telangana. Police were alerted by intelligence sources that a group of Maoists under the command of Bade Chokka Rao was roaming around. Police, who believe that the latest Maoist team entered in Bhadradri Kottagudem district. Photos of the suspects are widely circulated. Cumbing operations are being carried out in forest areas. With this the people in the agency are again worried .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X