• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ భేటీ-మరియమ్మ లాకప్ డెత్‌పై చర్చ-అప్పటికప్పుడు సీఎం ఆదేశాలు,అన్ని విధాలా ఆదుకునేలా

|

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. ఇందుకు కేసీఆర్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలియజేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,సీనియర్ నేతలు జగ్గారెడ్డి,శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు శుక్రవారం(జూన్ 25) హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

Mariyamma Lockup Death : తెలంగాణ సీఎస్,డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులుMariyamma Lockup Death : తెలంగాణ సీఎస్,డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు

అప్పటికప్పుడు సీఎం ఆదేశాలు...

అప్పటికప్పుడు సీఎం ఆదేశాలు...

మరియమ్మ లాకప్ డెత్ వివరాలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లామని భట్టి విక్రమార్క అన్నారు. ఆ పేద దళిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు వారిని ఆదుకోవాలని కోరామన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్... అప్పటికప్పుడు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి,చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌లను పిలిపించి స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకునేలా తమ సమక్షంలోనే కేసీఆర్ వారికి ఆదేశాలిచ్చారని చెప్పారు. శనివారం(జూన్ 26) డీజీపీని అడ్డగూడూరు గ్రామంలో పర్యటించాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు చెప్పారు.

అన్ని విధాల ఆదుకోనున్న ప్రభుత్వం

అన్ని విధాల ఆదుకోనున్న ప్రభుత్వం

మరియమ్మ కుటుంబాన్ని ఆదుకునేందుకు... ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్‌కు రూ.15 లక్షలతో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు. అలాగే మరియమ్మ బిడ్డలిద్దరికీ చెరో రూ.10లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు అంగీకరించారన్నారు. మరియమ్మ కుటుంబానికి ఒక నివాస గృహం కూడా కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ హామీలన్నీ త్వరలోనే అమలవుతాయని తాము ఆశిస్తున్నామన్నారు. ఈ నెల 28న ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరగా అందుకు సీఎం అంగీకరించారని తెలిపారు.

ఆ విమర్శలను కొట్టిపారేసిన భట్టి

ఆ విమర్శలను కొట్టిపారేసిన భట్టి

మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కాంగ్రెస్‌తో పాటు పోరాడుతున్న ప్రజా సంఘాలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలియజేశారు. అవసరమైతే అన్ని రాజ్యాంగ వ్యవస్థల తలుపులు తట్టి మరియమ్మ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ భావించిందన్నారు. ఈ క్రమంలోనే హక్కుల కమిషన్‌కు,జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని... కోర్టులో కేసు దాఖలు చేశామని చెప్పారు. సీఎంతో జరిగిన తాజా భేటీకి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో పేదలు,దళితులు,గిరిజనులపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకే సీఎంను కలిశామన్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌కు బీ టీమ్ అని చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.

అంతకుముందు గవర్నర్‌తో భేటీ

అంతకుముందు గవర్నర్‌తో భేటీ

కేసీఆర్‌తో భేటీకి ముందు కాంగ్రెస్ నేతలు గవర్నర్‌‌ తమిళిసైని కూడా కలిశారు. మరియమ్మ లాకప్ డెత్‌పై గవర్నర్‌కు వివరించిన నేతలు... బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని... దళితులపై దాడులకు తెరపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొందరు పోలీసులు ఆ శాఖకే మచ్చతెచ్చేలా పని చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారికి గుణపాఠం చెబుతామని అన్నారు.

English summary
CLP leader Bhatti Vikramarka said that they had discussed with CM KCR about dalit woman mariyamma lockup death at the Yadadri Bhongir district Addagudur police station.They had asked the chief minister to do justice to the family. It was informed that a positive response was received from KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X