వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి వెళ్లొచ్చి పట్టణమంతా తిరిగాడు: 19 మందికి సోకిన కరోనా, ఇంకెంతమందికి అంటించాడో?

|
Google Oneindia TeluguNews

వికారాబాద్: ఢిల్లీ నిజాముద్దీన్‌లో మర్కజ్ భవన్‌లో మత ప్రార్థనలకు హాజరైనవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, పోలీసులు పదే పదే చెబుతున్నా కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి కుటుంబాలతోపాటు ఇతరుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలు ఎక్కువ చోటు చేసుకుంటుండటం కలకలంగా మారుతోంది.

కరోనా చంపేస్తున్నా...: నిజాముద్దీన్‌లో వేలాదిమంది ప్రార్థనలు, వారికి కరోనా పాజిటివ్, మౌలానాపై ఎఫ్ఐఆకరోనా చంపేస్తున్నా...: నిజాముద్దీన్‌లో వేలాదిమంది ప్రార్థనలు, వారికి కరోనా పాజిటివ్, మౌలానాపై ఎఫ్ఐఆ

ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా..

ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా..

వికారాబాద్ పట్టణానికి చెందిన ఓ సంస్థ నిర్వాహకుడు మార్చి 13 నుంచి 17 మధ్య ఢిల్లీలోని మర్కజ్ భవన్‌లో జరిగిన మత ప్రార్థనలకు హాజరై తిరిగొచ్చాడు. ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. లాక్‌డౌన్ నిషేదాజ్ఞలను సైతం లెక్కచేయకుండా బంధువుల ఇళ్లకు తిరిగాడు.

ఆ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా 19 మందికి..

ఆ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా 19 మందికి..


కాగా, ఈ వ్యక్తి నిర్లక్ష్యం, బాధ్యతా రహిత్యం వల్ల అతనికున్న కరోనావైరస్.. మరో 19 మందికి సోకింది. ఏప్రిల్ 14న వికారాబాద్ పట్టణంలో కొత్తగా ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఐదు కేసులు కూడా సదరు వ్యక్తి వల్లేనని అధికారులు గుర్తించారు.
మార్చి 19న తిరిగి వచ్చిన కరోనా బాధిత వ్యక్తి వికారాబాద్ పట్టణంలో పలువురిని కలిసినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత హైదరాబాద్ కూడా వెళ్లినట్లు అధికారుల విచారణలో తేలింది. దగ్గు, జ్వరం బారిన పడిన అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలడంతో కలకలం రేగింది.

ఇంకెంతమందికి అంటించాడో..?

ఇంకెంతమందికి అంటించాడో..?


ఈ క్రమంలో సదరు కరోనా బాధితుడు ఎక్కడెక్కడ తిరిగాడు? ఎవరిని కలిశాడు? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అతని కారణంగా 19 మందికి కరోనా సోకడంతో ఇంకెంత మంది ఆ మహమ్మారి బారిన పడ్డారో తేల్చే పనిలో పడ్డారు అధికారులు, పోలీసులు. ఇంతకుముందు కూడా వికారాబాద్‌లో ఓ వ్యక్తి ఢిల్లీ వెళ్లి వచ్చి 11 మంది కుటుంబసభ్యులకు కరోనా అంటించిన విషయం తెలిసిందే.

పెరుగుతున్న కేసులు..

పెరుగుతున్న కేసులు..

ఇది ఇలావుండగా, రాష్ట్రంలో 52 మందికి కొత్తగా కరోనా సోకినట్లుగా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో మంగళవారం రాత్రి నాటికి 644కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 110 మందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 516 మంది ఉన్నారు. ఇక మొత్తం మరణాల సంఖ్య 18కి చేరింది. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.

English summary
Markaz returned man carelessness: 19 persons infected with coronavirus in vikarabad town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X