హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తలసానికి షాక్: మంచిపని చేశారని కాంగ్రెస్ నేత హ్యాపీ, కెసిఆర్‌కు థ్యాంక్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వాణిజ్య పన్నుల శాఖ నుంచి తప్పించడంపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ధన్యవాదాలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని, మర్రి పోటీ చేశారు. తలసాని గెలుపొందారు.

కాగా, మర్రి మాట్లాడుతూ... వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను తప్పించి మంచి పని చేశారని వ్యాఖ్యానించారు. వ్యాపారులు, అధికారులను తలసాని వేధింపులకు గురి చేశారని ఆయన మంగళవారం నాడు ఆరోపించారు.

హైదరాబాద్‌లోని వ్యాపారస్థుల తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తలసాని హైదరాబాద్‌కు కాకుండా రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం జరిగిన మంత్రివర్గ మార్పుల్లో తలసానిని వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించి ప్రస్తుత మున్న సినిమాటోగ్రఫీతో పాటు కొత్తగా పశుసంవర్థకశాఖ, మత్స్య శాఖలను అప్పగించిన విషయం తెలిసిందే.

 Marri happy with KCR decision on Talasani's portfolio

తెలంగాణ అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా దేవులపల్లి

తెలంగాణ అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా ప్రముఖ రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకర్ రావు నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేబినెట్ హోదాలో ఆయన ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్‌గా వేముల ప్రశాంత్‌రెడ్డి నియామకం

తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ (మిషన్ భగీరథ) వైస్ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ ర్యాంకులో ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు.

English summary
Marri Shashidhar Reddy happy with KCR decision on Talasani's portfolio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X