వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలసాని వ్యవహారాన్ని తేల్చండి: స్పీకర్‌కు మర్రి శశిధర్ రెడ్డి లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్ఱభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారాన్ని తేల్చాలని కాంగ్రెసు తెలంగాణ నాయుకుడు మర్రి శశిధర్ రెడ్డి స్పీకర్ మధుసూదనా చారిని కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు ఓ లేఖ రాశారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారా, లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ఒకవేళ తలసాని రాజీనామా చేసి ఉంటే దాన్ని ఎందుకు ఆమోదించడం లేదో తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Marri Sashidhar Reddy seeks clarity on Talasani Issue

టిడిపి శాసనసభ్యుడైన తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి, గవర్నర్ నరసింహన్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన విమర్సించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించలేనప్పుడు గవర్నర్ పదవిలో నరసింహన్ కొనసాగకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

శాసనసభ ఎన్నికల్లో తలసాని శ్రీనివాస యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి టిఆర్ఎస్‌లో చేరారు. ఆ సమయంలో ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే, ఆయన స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించలేదు.

English summary
Congress Telangana leader Marri Sashidhar Reddy urged speaker Madhusudanachari to clarify on Telangana minister Talasani Srinivas Yadav's issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X