మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక తిరుగుడు బందే.. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సులభతరం.. సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలంటే..!

|
Google Oneindia TeluguNews

వనపర్తి : ఇప్పటివరకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేంది. అక్కడ సిబ్బంది గానీ, సబ్ రిజిస్ట్రార్ అందుబాటులో లేకుంటే రోజుల తరబడి ఆ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. ఆ క్రమంలో చాలామంది మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడమే మరచిపోయారు. అయితే అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల్లో వివాహ రిజిస్ట్రేషన్లు నమోదు చేసేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.

జనన, మరణాలు నమోదు చేయించుకుంటున్నట్లు వివాహ రిజిస్ట్రేషన్లు కూడా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి రావడంతో చాలామంది ఆ ప్రయత్నం విరమించుకుంటున్నారు. దాంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇక సులభతరం

మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇక సులభతరం

ఇప్పటివరకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే వివాహ రిజిస్ట్రేషన్ల సర్టిఫికెట్ పొందాల్సి వచ్చేది. దానికోసం మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. అలా గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఒక్కోసారి ఆ కార్యాలయంలో సిబ్బంది లేక వెనుదిరగాల్సి వచ్చేది. అయితే అవన్నీ తిప్పలు ఎందుకు అనుకుని చాలామంది వివాహ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం మరిచిపోయారు.

క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో మార్పులు చేసింది. ఇకపై ఆయా పంచాయతీ, మున్సిపల్ పరిధిలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్ల ద్వారా పెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం లభించింది.

పంచాయతీ, మునిసిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు

పంచాయతీ, మునిసిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు

పెళ్లి జరిగిన తేది నుంచి 30 రోజుల్లోగా సంబంధిత పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లోనైతే పంచాయతీ కార్యదర్శిని కలిసి ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. వరుడు లేదా వధువు తరపు తల్లిదండ్రులు పంచాయతీ కార్యాలయంలో నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. దానిపై వరుడు, వధువు తరపు వారు సాక్షులుగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇక ఆ అప్లికేషన్‌లో వారిద్దరి వయసు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం పంచాయతీ కార్యదర్శి ఆ వివరాలను పెళ్లిళ్ల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.

మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బాధ్యత పంచాయతీలకు అప్పజెప్పడంతో దానిపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల వనపర్తి జిల్లా కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీవోలకు.. జిల్లా వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో వన్ డే ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా శక్తి కేంద్రం మహబూబ్‌నగర్‌ కో-ఆర్డినేటర్‌ అరుణ మారిన నిబంధనలు, పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించుకునే అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో పెళ్లిళ్ల రిజిస్ట్రార్‌గా కలెక్టర్, అదనపు రిజిస్టార్‌గా జిల్లా సంక్షేమ అధికారి పని చేస్తారని చెప్పారు.

మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్దత

మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్దత

సాధారణంగా పెళ్లి జరిగిన నెల రోజుల వ్యవధిలో వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు నెలల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆ పెళ్లికి చట్టబద్దత లభిస్తుంది. ఇక ఆయా కుటుంబాలకు వర్తించే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

English summary
Earlier marriage certificates issued at sub registrar office which is in mandal head quarters. Now onwards marriage registration certificate will be issued in panchayat and municipal offices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X