వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాపం పండిందా..? ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య..

|
Google Oneindia TeluguNews

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. చింతల్ బస్తీలో గల ఆర్య వైశ్య భవన్‌లో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం భవన్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. మారుతీరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కానీ కేసుల ఒత్తిడితోనే చనిపోయి ఉంటారని తెలుస్తోంది. కానీ కుటుంబసభ్యులు మాత్రం.. పోలీసుల వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు.

Recommended Video

Amrutha Pranay Father | వేధింపులా..? మానసిక ఒత్తిడా..? పశ్చాత్తాపమా? ఆత్మహత్యకు కారణమేంటీ..?
 ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..

మారుతీరావు కూతురు అమృత-ప్రణయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇది నచ్చని మారుతీరావు 2018 సెప్టెంబర్‌లో కిరాయి రౌడీలతో ప్రణయ్‌ను నడిరోడ్డుపై హత్య చేయించాడనే ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణ తుది దశకు చేరుకున్నది. అయితే ఇటీవల మిర్యాలగూడలో గల మారుతీరావు షెడ్డులో మరో మృతదేహాం కనిపించింది. ప్రణయ్ హత్య కేసులో ఏ1 నిందితుడిగా, షెడ్యులో మరో ఆత్మహత్య... ఇతర కేసులతో మారుతీరావు ఒత్తిడికి గురయ్యారని తెలుస్తోంది.

 లిప్ట్ చేయని ఫోన్..

లిప్ట్ చేయని ఫోన్..

శనివారం రాత్రి ఆర్య వైశ్య భవన్‌లో మారుతీరావు గది అద్దెకు తీసుకున్నాడు. కేసుల ఒత్తిడితో మారుతీరావు కలత చెందినట్టు తెలుస్తోంది. సాయంత్రం అతని భార్య ఫోన్ చేసిన లిప్ట్ చేయలేదు. దీంతో ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని ఆమె అప్రమత్తం చేశారు. మారుతీరావును పిలిచినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. తలుపు బద్దలుకొట్టి సిబ్బంది లోపలికి ప్రవేశించారు. అప్పటికే ఆయన బెడ్‌పై అచేతనంగా కనపించడంతో.. సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 కోట్లు గడించి..

కోట్లు గడించి..

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లకు పడగెలెత్తాడు. కూతురు అమృత-ప్రణయ్ ప్రేమను అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి ఆమె పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం కిరాయి రౌడీలతో ప్రణయ్‌ను హత్య చేయించాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.

ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..

గర్భవతి అయిన అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తోన్న సమయంలో దాడి చేశారు. ప్రణయ్‌ను దారుణంగా హత్య చేశారు. ప్రణయ్ దాడి కేసులో తన తండ్రి మారుతీరావుపై అమృత అనుమానం వ్యక్తం చేశారు. హత్య, పీడీ యాక్ట్ కేసు పెట్టడంతో.. మారుతీరావు జైలుకెళ్లాడు. ఆరునెలల కింద జైలు నుంచి బయటకువచ్చాడు. అప్పటినుంచి కూతురుతో సంప్రదింపులు జరిపాడు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి మొత్తం అమృత పేరున రాస్తానని మధ్యవర్తులతో రాయబారం నడిపినట్టు తెలుస్తోంది.

English summary
pranay murder a1 Accused maruthi rao suicide in chintal basthi arya vysa bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X