మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో మరో కొత్త మండలం -సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -మెదక్ జిల్లాలో మాసాయిపేట మండలం

|
Google Oneindia TeluguNews

పరిపాలన సంస్కరణల పేరుతో ఇప్పటికే జిల్లాల విభజన, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలను ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే వినతి మేరకు మరో కొత్త మండలాన్ని సృష్టించింది. దీనికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. కొత్త మండలం ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) మంగళవారం ప్రకటించింది.

కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం -ముస్లిం, యూదు పెద్దల వ్యతిరేకత -మత గ్రంథాల్లో ఏముంది?కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం -ముస్లిం, యూదు పెద్దల వ్యతిరేకత -మత గ్రంథాల్లో ఏముంది?

తెలంగాణలో మరో కొత్త మండలనికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో కొత్తగా మాసాయిపేటను మండలంగా మార్చేందుకు కేసీఆర్ నిర్ణయించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మాసాయిపేటను మండలంగా ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ అంగీకరించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

 Masaipet in Medak district is a new mandal: CM KCR

తుప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చేగుంట మండలంలోని 3 గ్రామాలు, యెల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు మొత్తంగా 9 గ్రామాలతో మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులను త్వరలోనే జారీ చేయనున్నారు. ఈ మేరకు సీఎంవో ప్రకటన చేసింది.

ఆవును మందలించాడని వ్యక్తి హత్య -నిందితుడు యాదవ్ పాల వ్యాపారి -మృతుడు గుప్తా దారుణస్థితిఆవును మందలించాడని వ్యక్తి హత్య -నిందితుడు యాదవ్ పాల వ్యాపారి -మృతుడు గుప్తా దారుణస్థితి

కొత్త మండలం ఏర్పాటుతో తెలంగాణలో మొత్తం మండలాల సంఖ్య 589కి పెరిగింది. తెలంగాణలో 33 జిల్లాలు, 589 మండలాలు, 70 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మూసాయిపేట మండలం కంటే ముందు, ముచ్చింతల్ పల్లి(మేడ్చల్), నారాయణపురం (సిద్ధిపేట),మొస్రా,చండూరు(నిజామాబాద్) తదితర మండలాలనూ కొత్తగా నోటిఫై చేయడం తెలిసిందే.

నివేదా పేతురాజ్ గ్లామరస్, బోల్డ్ ఫోటోలు.. అందానికి అందంగా బ్యూటీ

English summary
Telangana Chief Minister K Chandrashekhar Rao has given clearance for formation of a new mandal in medak district. According to the CMO, responding to a request by the Narsapur MLA Chilumula Madan Reddy, the Chief Minister gave consent for formation of Masaipet as a new mandal in Toopuran revenue division in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X