హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ గ్రీన్ బావర్చి హోటల్లో భారీ అగ్నిప్రమాదం; 14 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ నగరంలోని గ్రీన్ బావర్చి హోటల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయదుర్గం వద్ద ఉన్న గ్రీన్ బావర్చి హోటల్ లో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఐమాక్ చాంబర్ లోని రెండవ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనివల్ల భవనమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనలో గ్రీన్ బావర్చి హోటల్లో భవనం లోపల ఉన్న 14 మంది చిక్కుకుపోయారు. దట్టమైన పొగతో వారు ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే వారంతా హాహాకారాలు చేస్తూ టెర్రస్ పైకి పరుగులు తీశారు.

వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెస్టారెంట్‌ పూర్తిగా దగ్ధం; ఆస్తి నష్టంవరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెస్టారెంట్‌ పూర్తిగా దగ్ధం; ఆస్తి నష్టం

గ్రీన్ బావర్చి హోటల్ అగ్ని ప్రమాద ఘటనలో చిక్కుకున్న 14 మంది సేఫ్

గ్రీన్ బావర్చి హోటల్ అగ్ని ప్రమాద ఘటనలో చిక్కుకున్న 14 మంది సేఫ్


ఇక అగ్ని ప్రమాద ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనలో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది భవనంపైన చేరుకున్న వారిని భారీ క్రేన్ ల సహాయంతో రక్షించారు. ప్రస్తుతం వారందరినీ సురక్షితంగా క్రిందికి తీసుకురాగలిగారు. దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరైన బాధితులకు ప్రథమ చికిత్స చేసి వారిని ఇళ్లకు తరలించారు. ఇక ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 గ్రీన్ బావర్చి హోటల్లో అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

గ్రీన్ బావర్చి హోటల్లో అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు


ఇక మంటలను అదుపు చేయడం కోసం రెండు ఫైరింజన్లు రంగంలోకి దింపి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. నాలుగు అంతస్థుల బిల్డింగ్ కు ఎగ్జిట్ కు సంబంధించిన దారి లేకపోవడంతో వారు తప్పించుకోలేక అందరూ పైకి వెళ్లారని మాదాపూర్ ఏసిపి వివరించారు. గ్రీన్ బావర్చి హోటల్లో ఈ ఘటన ఎలా సంభవించింది అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందా లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 దట్టమైన పొగలు కమ్ముకోవటంతో బయటకు పరుగులు తీసిన జనాలు

దట్టమైన పొగలు కమ్ముకోవటంతో బయటకు పరుగులు తీసిన జనాలు


ఇక భవనంలో సెకండ్, థర్డ్ ఫ్లోర్ లో ఐటీ ఆఫీసులు, నాలుగవ ఫ్లోర్లో ఒక సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయం ఉండడంతో వాటిలో పనిచేసే వారందరూ ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో బయటకు పరుగులు తీశారు. భయంతో వణికిపోయారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఆస్తినష్టం మినహాయించి, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

 నిత్యం ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాద ఘటనలు

నిత్యం ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాద ఘటనలు


ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇటీవల నిత్యం ఎక్కడో ఒకచోట అగ్నిప్రమాద ఘటనలు సంభవిస్తూనే ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున వరంగల్ చౌరస్తాలో మను ఫ్యామిలీ రెస్టారెంట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈలోపే రెస్టారెంట్ లోని ఫర్నిచర్ మొత్తం దగ్ధమైంది. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఇక గురువారం నాడు హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో కూడా ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి పాతబస్తీ చార్మినార్ సమీపంలో లాడ్ బజార్ లోని రెండు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఒక బట్టల దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో కూడా భారీగానే ఆస్తినష్టం జరిగింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

English summary
A huge fire broke out at the Green Bawarchi Hotel in Hyderabad. Trapped in it, the victims ran up to the terrace. Firefighters rushed to the scene and rescued 14 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X