వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ ఘోర ప్రమాదం: పోలీసుల అదుపులో భద్రకాలి పైర్ వర్క్స్ ఓనర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్‌ వర్స్క్‌లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో పోలీసులు బాణసంచా దుకాణ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండానే దీనిని నడిపిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని బాంబుల కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

భద్రకాళీ ఫైర్‌వర్క్స్‌లో భారీ అగ్నిప్రమాదం: 11మంది సజీవదహనంభద్రకాళీ ఫైర్‌వర్క్స్‌లో భారీ అగ్నిప్రమాదం: 11మంది సజీవదహనం

కాగా, బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించి పదకొండు మంది మృతి చెందిన విషయం తెలిసింగే. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చింది. భారీ శబ్దాలతో బాణసంచా పేలింది. ఆ సమయంలో గోదాములో 25 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Massive fire erupts in cracker factory in Telanganas Warangal, 11 killed

మంటలు చెలరేగిన వెంటనే అక్కడ పనిచేసేవారు భయంతో బయటకు పరుగు తీశారు. పదిమంది కార్మికులు మంటల్లో సజీవ దహనం, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాయపడ్డ వారిని ఎంజీఎంకు తరలించారు.

వరంగల్ అగ్నిప్రమాదంపైసీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైసీపీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

English summary
At least 11 people died and several others were injured after a fire broke out at a firecracker godown in Warangal district of Telangana. Four fire tenders were rushed to the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X