వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాపం పసిపాప ..8 రోజులుగా నల్లమల అడవిలో .. ఆచూకీ కోసం అడవి జల్లెడ

|
Google Oneindia TeluguNews

Recommended Video

నల్లమల అడవిలో... తప్పిపొయిన 6 ఏళ్ల పసిపాప!!

ఓ చిన్నారి తప్పిపోయింది.. తాత తో కలిసి అడవికి వెళ్ళిన చిన్నారి జాడ తెలియకుండా పోయింది. వందలాదిగా పోలీసులు, గ్రామస్తులు పాప జాడ కోసం నల్లమల అటవీ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నా వారం రోజులుగా చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు. అసలు ఇంతకీ పాప ఎలా ఉంది అన్న ఆవేదన పాప తల్లిదండ్రులను కన్నీరుమున్నీరు చేస్తుంటే, పాప క్షేమంగా ఉందా? లేదా ఏదైనా అడవి జంతువుల బారిన పడిందా అన్న ఆందోళన పాప కోసం వెతుకుతున్న వారిలో కనిపిస్తోంది.అడవిలో తప్పిపోయి అమ్మానాన్నల కోసం అలమటిస్తున్న ఆరేళ్ల చిన్నారి పరిస్థితి ఏంటి ? వారం రోజులుగా పాప ఎలా ఉంది?

రవి ప్రకాష్ కోసం బెంగళూరు, గుజరాత్ లలో పోలీసురవి ప్రకాష్ కోసం బెంగళూరు, గుజరాత్ లలో పోలీసు

 నల్లమల అటవీ ప్రాంతంలో తప్పిపోయిన చిన్నారి శ్రావణి

నల్లమల అటవీ ప్రాంతంలో తప్పిపోయిన చిన్నారి శ్రావణి

మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ కు చెందిన గిరిజన చిన్నారులు శ్రావణి, రేణుకలు తాత తో కలిసి మేకలు తోలుకుని అడవికి వెళ్ళారు. తాత వెంట అడవికి వెళ్ళిన చిన్నారులు దారి తప్పి పోయారు. ఇంటికి వద్దామని ప్రయత్నం చేసిన క్రమంలో దట్టమైన అరణ్యంలో చిక్కుకుపోయారు. దట్టమైన అడవిలో కిలోమీటర్ల దూరం నడిచిన చిన్నారులు తాత జాడ కనిపించక ఏడ్చుకుంటూ అడవంతా వెతికారు. క్రూర మృగాలు ఉన్న ఆ అరణ్యంలో దారి తెలియక రోదిస్తూ తిరిగారు. ఆకలిగా ఉండటంతో అడవిలోని దుంపలు తిన్నారు. రాత్రి కావడంతో ఓ చెట్టుకింద నిద్రించారు. రెండు రోజులపాటు అడవిలోనే ఉన్న చిన్నారులలో ఒక చిన్నారి రేణుక ఎట్టకేలకు అడవి నుండి గ్రామానికి చేరింది.

అడవి నుండి బయటపడ్డ రేణుక .. శ్రావణి ఆచూకీ కోసం గాలింపు

అడవి నుండి బయటపడ్డ రేణుక .. శ్రావణి ఆచూకీ కోసం గాలింపు

అయితే చెట్టు కింద నిద్రించిన క్రమంలో తెల్లవారుజామున రేణుక శ్రావణిని ఎంత లేపినా లేవకపోవడంతో రేణుక ఒక్కతే అడవి నుండి బయటకు వచ్చింది. సమీప గ్రామాల ప్రజలు అడవిలో తప్పిపోయి న రేణుకను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కానీ తనతో పాటు అడవిలో చిక్కుకుపోయిన శ్రావణి ఎక్కడ ఉందో రేణుక చెప్పలేకపోయింది.

ప్రస్తుతం శ్రావణి కోసం ఐటీడీఏ అధికారులు ,పోలీసులు, రెవిన్యూ సిబ్బంది, గ్రామస్తులు వారం రోజులుగా వెతుకుతున్నారు. డప్పులు కొడుతూ, కొమ్ము బూరలు ఊగుతూ శ్రావణి కోసం గాలింపు చేపట్టారు. నల్లమల అటవీ ప్రాంతంలోని టైగర్ రిజర్వ్ ఏరియాలో పాప కోసం 200 మంది సిబ్బంది గాలిస్తున్నారు. మొత్తం 30 కిలోమీటర్ల పరిధిలో పాప కోసం గాలింపు చేస్తున్నారు.

వారం రోజులుగా కనిపించని పాప .. అసలు పాప ఏమయ్యింది ?

వారం రోజులుగా కనిపించని పాప .. అసలు పాప ఏమయ్యింది ?

కానీ ఇప్పటివరకు శ్రావణి ఆచూకీ దొరకలేదు. మల్లాపూర్ రోడ్డు లోని నల్లమల అడవి ప్రాంతం జల్లెడ పడుతున్నారు. పాప ఏదైనా క్రూరమృగాల బారిన పడిందా అన్న కోణంలో కూడా వెతుకుతున్నారు. వారం రోజులుగా పాప కనిపించకపోవడంతో అసలు పాప బ్రతికే ఉందా అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఏదైనా కొండచిలువ బారిన పడిందా అని గ్రామస్తులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ల చిన్నారి దట్టమైన అటవీ ప్రాంతంలో తప్పిపోయిన నేపథ్యంలో పాప జాడ కనిపించేవరకూ అడవిని గాలిస్తామని అధికారులు చెబుతున్నారు.

English summary
massive manhunt with over 200 men has been launched to trace a missing 6-year-old tribal girl in the dense Nallamala Tiger Reserve in Telangana after she went missing last Friday.A Chenchu girl identified as Shravani went missing in Amrabad Tiger Reserve area. The Mahbubnagar district administration along with forest officials and tribesmen has launched a search operation to trace her in the dense forest.Over 200 men are looking for the girl in a 30-kilometer radius inside the tiger reserve amid bad weather conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X