హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్డన్ సెర్చ్: 15ఆటోలు, 65బైకులు సీజ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ హసన్‌నగర్‌లో సైబరాబాద్ పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ అదనపు డిసిపిలు శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, శంషాబాద్ డిసిపి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ముగ్గురు ఏసిపిలు, 28మంది ఇన్‌స్పెక్టర్లు, 44మంది ఎస్సైలతోపాటు పలువురు కానిస్టేబుళ్లు ఈ సెర్చ్‌లో పాల్గొన్నారు.

హసన్‌నగర్, ఇంద్రానగర్, ఎన్టీఆర్‌నగర్, బాబానగర్, మహమూద్‌నగర్‌లలో పోలీసుల తనిఖీలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ తనిఖీలో పలువురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. హసన్‌నగర్‌లో ఉండే మహ్మద్ మునీర్(22), మహ్మద్ యూనుస్, మహ్మద్ మోసిన్(19)తోపాటు రాజేంద్రనగర్ ఠాణా రౌడీషీటర్ షేక్ సయీద్ కుమార్ షేక్ మస్తాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు 12మందిని అనుమానితును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనుమానితుల ఇళ్లలో దాదాపు 15 ఆటోలు, 65 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నెంబర్, పత్రాలు లేని బైకులు, ఆటోలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, వాహనాల పత్రాల గురించి పోలీసులు అడిగితే.. ఎందుకు చెప్పాలంటూ పలువురు ప్రశ్నించడం గమనార్హం.

దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించి సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సెర్చ్ కొనసాగుతాయని శంషాబాద్ డిసిపి రమేష్ నాయుడు తెలిపారు.

కార్డన్ సెర్చ్

కార్డన్ సెర్చ్

నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ హసన్‌నగర్‌లో సైబరాబాద్ పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

కార్డన్ సెర్చ్

కార్డన్ సెర్చ్

సైబరాబాద్ కమిషనరేట్ అదనపు డిసిపిలు శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, శంషాబాద్ డిసిపి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ముగ్గురు ఏసిపిలు, 28మంది ఇన్‌స్పెక్టర్లు, 44మంది ఎస్సైలతోపాటు పలువురు కానిస్టేబుళ్లు ఈ సెర్చ్‌లో పాల్గొన్నారు.

కార్డన్ సెర్చ్

కార్డన్ సెర్చ్

హసన్‌నగర్, ఇంద్రానగర్, ఎన్టీఆర్‌నగర్, బాబానగర్, మహమూద్‌నగర్‌లలో పోలీసుల తనిఖీలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ తనిఖీలో పలువురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కార్డన్ సెర్చ్

కార్డన్ సెర్చ్

హసన్‌నగర్‌లో ఉండే మహ్మద్ మునీర్(22), మహ్మద్ యూనుస్, మహ్మద్ మోసిన్(19)తోపాటు రాజేంద్రనగర్ ఠాణా రౌడీషీటర్ షేక్ సయీద్ కుమార్ షేక్ మస్తాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు 12మందిని అనుమానితును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కార్డన్ సెర్చ్

కార్డన్ సెర్చ్

అనుమానితుల ఇళ్లలో దాదాపు 15 ఆటోలు, 65 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

English summary
With a view to check criminal activities in the city, over 450 police personnel participated in a massive cordon and search operation to locate criminals and suspects at Hasnanagar area here in the early hours on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X