వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంథని మధుకర్ మృతి కేసులో తొలి యాక్షన్: సీఐ ప్రభాకర్‌పై వేటు..

ప్రభాకర్‌పై వేటుతో మంథని మధుకర్ మృతి వ్యవహారంలో తొలి యాక్షన్ తీసుకున్నట్లయింది. ఆయన స్థానంలో కొత్త సీఐగా నతేష్ ను నియమిస్తూ బుధవారం పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంథని మధుకర్ అనుమానస్పద మృతి వ్యవహారంలో ఎట్టకేలకు మంథని సీఐ ప్రభాకర్ పై వేటు పడింది. కేసును పక్కదోవ పట్టించి జరిగిన హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని సీఐ ప్రభాకర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ప్రభాకర్‌పై వేటుతో మంథని మధుకర్ మృతి వ్యవహారంలో తొలి యాక్షన్ తీసుకున్నట్లయింది. ఆయన స్థానంలో కొత్త సీఐగా నతేష్ ను నియమిస్తూ బుధవారం పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేసును తొలుత విచారించిన సీఐ బాధిత కుటుంబాన్ని బెదిరించి కేసును ఆత్మహత్యగా క్లోజ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో కేసు విచారణను సైతం పెద్దపల్లి ఏసీపీ సింధుశర్మకు బదిలీ చేయడం జరిగింది.

Mathani ci prabhakar transfered on the allegations of madhukar death

<strong>కేసీఆర్‌కు మంథని దెబ్బ:మూడెకరాలు పోయి ఆరడగుల జాగనా?, 'మధుకర్' ఘటనపై పెల్లుబికిన ఆగ్రహం</strong>కేసీఆర్‌కు మంథని దెబ్బ:మూడెకరాలు పోయి ఆరడగుల జాగనా?, 'మధుకర్' ఘటనపై పెల్లుబికిన ఆగ్రహం

మధుకర్ మృతదేహానికి రెండు మూడురోజుల్లో రీపోస్టు మార్టమ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనలో స్థానిక ప్రజాప్రతినిధి పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు ఉండటం.. ఘటనను నిరసిస్తూ దళిత సంఘాలు, ప్రజాసంఘాలు మెరుపు ధర్నా నిర్వహించడంతో మధుకర్ మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

English summary
Manthani CI Prabhakar was transfered on the allegations of Madhukar's suspicious death. Victim parents alleged that CI was warned them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X