హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీని ఇంటర్నేషనల్ కోర్టుకు లాగిన జగన్: ఏమిటీ ఇందూ టెక్, జగన్‌కు రూ.కోట్లు?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మారిషస్ భారత ప్రభుత్వాన్ని కోర్టుకు లాగింది. ఇందూటెక్ జోన్‌లో పెట్టుబడులు పెట్టి తాము నష్టపోయామని నెదర్లాండ్స్‌లోని ఆర్బిట్రేషన్ ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Recommended Video

Mauritius drags Modi to international court over Jagan's case

మారిషస్ ట్విస్ట్: జగన్ కేసులో మోడీకి లీగల్ నోటీసులుమారిషస్ ట్విస్ట్: జగన్ కేసులో మోడీకి లీగల్ నోటీసులు

మారిషస్ ప్రభుత్వం నోటీసులు పంపిన విషయం తెలంగాణ ప్రభుత్వం ధ్రువీకరించింది. సీబీఐ, ఈడీ కేసుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. వారం రోజుల క్రితమే ఇందూ టెక్ జోన్ ఛార్జీషీటును సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. మార్చి 16న కోర్టుకు హాజరుకావాలని జగన్, విజయసాయి రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, బీపీ ఆచార్య, నిమ్మగడ్డ ప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డిలకు సమన్లు కూడా పంపింది.

వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు

వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నాటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి గ్రామంలో ఇందూ టెక్ జోన్ (ఎస్ఈజెడ్) కోసం 250 ఎకరాల భూమిని అలాట్ చేసింది. శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన ఇందు కన్సార్టియంకు ఆ భూమిని ఇచ్చిందని ఈడీ ఛార్జీషీటులో పేర్కొంది.

 అర్హతలు లేనప్పటికీ

అర్హతలు లేనప్పటికీ

అవసరమైన అర్హత లేనప్పటికీ నాడు ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ఎండీ మరియు వైస్ చైర్మన్‌గా ఉన్న బీపీ ఆచార్య ఈ కేటాయింపులకు సిఫార్సు చేశారని పేర్కొన్నారు. ఎస్ఐజెడ్ అప్రూవల్ వచ్చాక అందులో నుంచి 100 ఎకరాలను శ్యాంప్రసాద్ రెడ్డి తన తనయుడు దయాకర్ రెడ్డికి చెందిన ఎస్పీఆర్ ప్రాపర్టీస్‌కు బదలీ చేశారని, అలాగే నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన రెండు కంపెనీలకు షేర్లు విక్రయించారని ఈడీ పేర్కొంది.

జగన్ కంపెనీల్లోకి కోట్లు

జగన్ కంపెనీల్లోకి కోట్లు

శ్యాంప్రసాద్ రెడ్డి రూ.50 కోట్లను వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టారని ఈడీ ఛార్జీషీటులో పేర్కొంది. అలాగే జగన్‌కే చెందిన కార్మెల్ ఏసియాలో రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. ఇదంతా క్విడ్ ప్రో కో లెక్కన జరిగిందని పేర్కొంది. మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 ప్రకారం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని ఈడీ కోరింది.

 రూ.115 కోట్లు పెట్టుబడి

రూ.115 కోట్లు పెట్టుబడి

ఇందూ సెజ్‌లో శ్యాంప్రసాద్ రెడ్డి, మారిషస్ పెట్టుబడులు ఉన్నాయి. ఈ సెజ్‌లో మారిషస్‌కు 49 శాతం వాటా ఉంది. ఇందూ టెక్‌లో మారిషస్‌కు చెందిన కరీసా ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తం రూ.115 కోట్లు పెట్టుబడి పెట్టింది.

English summary
The InduTech Zone investments case has become more convoluted now that the Mauritius government has dragged India to the International Court of Justice for arbitration in the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X