హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఏం జరిగిందో చెప్పండి': హనీషా చౌదరి ఆత్మహత్య కేసులో ట్విస్ట్, ప్రియుడిపై విచారణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రియుడు చూస్తుండగానే లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్న హనీషా చౌదరి కేసులో ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హనీషా, ఆమె ప్రియుడు దీక్షిత్ పటేల్‌ల మధ్య జరిగిన వాట్సాప్ సందేశాల్లో కొన్ని డీలీట్ అయ్యాయా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.

Recommended Video

ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య వెనుక ఇన్ని కోణాలా ?

ఇప్పటికే దీక్షిత్ పటేల్ ఆమెపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని, ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించలేదని పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమె వాట్సాప్ సందేశాలు కొన్ని డిలీట్ అయ్యాయని అంటున్నారు. ఆ కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు.

అన్ని కోణాల్లో దర్యాఫ్తు

అన్ని కోణాల్లో దర్యాఫ్తు

హైదరాబాదు కొంపల్లిలోని శివశివానీ కాలేజీలో ఎంబీయే రెండో సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లాకు చెందిన హనీషా చౌదరి ఇటీవల తన ప్రియుడు దీక్షిత్ పటేల్‌తో అర్ధరాత్రి లైవ్ చాట్‌లో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.

ఏం జరిగిందో చెప్పమంటున్నారు

ఏం జరిగిందో చెప్పమంటున్నారు

హనీషా చౌదరి తల్లిదండ్రులు పోలీసులను కలిసి తమ కూతురు చనిపోవడానికి గల కారణాలను చెప్పాలని కోరారు. ప్రియుడి ప్రేరణతో చనిపోయిందా అనే అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తల్లిదండ్రులు కలవడంపై పోలీసులు మాట్లాడుతూ.. వారు అనుమానం వ్యక్తం చేయలేదని, ఏం జరిగిందో చెప్పమని అడిగారని తెలిపారు. వీడియో చాటింగులు డిలీట్ అయ్యాయని అంటున్నారని తెలిపారు.

రికార్డుల ప్రకారం

రికార్డుల ప్రకారం

హనీషా చౌదరి, దీక్షిత్ పటేల్‌ల మధ్య ఏడాదిన్నరగా ఫ్రెండ్‌షిప్ ఉందని, అనంతపురంలో ఓ పెళ్లి కోసం అతనికి చెప్పగా, అతను సరేనని చెప్పాడని, తాము పరిశీలించిన రికార్డులు, విచారణ మేరకు అతను అభ్యంతరం చెప్పలేదని, కానీ కొన్ని డిలీట్ చేశారని అంటున్నారని చెబుతున్నారు. అయితే తాను పెళ్లికి వెళ్తే అనుమానం వస్తుందేమోనని ఆమె ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తేలిందని, అయినా విచారణ లోతుగా చేస్తున్నామన్నారు.

అనుమానాలు నివృత్తి

అనుమానాలు నివృత్తి

హనీషా తల్లిదండ్రుల అనుమానాల మేరకు విచారణ జరిపి, వారికి అనుమానాలు ఉంటే పోలీసులు నివృత్తి చేయనున్నారు. ఆమె సూసైడ్ చేసుకోవడానికి అతను ప్రేరేపించారా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, హనీషాకు అనంతపురంలో ఓ స్నేహితుడు ఉన్నారు. అతని పెళ్లికి వెళ్తే దీక్షిత్ అనుమానిస్తాడేమోనని ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

English summary
In a shocking incident, a Hyderabad-based management student hanged herself in her hostel room during an ongoing video call with her friend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X