హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వన్ఇండియా ప్రత్యేకం: పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) అంటే ఏమిటి?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కోర్టు పరిభాషలో ఫలాన ఆయన ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో పిల్ వేశారు అని చాలా సార్లు వింటూ ఉంటాం. అసలు పిల్ అంటే ఏమిటి. మన దేశంలో మొట్టమొదటిసారి ఎప్పుడు దీనిని అమల్లోకి తీసుకొచ్చారో తెలుసుకుందాం.

1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీని ప్రవేశపెట్టి రాజకీయ పార్టీలను, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసింది. ఎమర్జెన్సీ ప్రభావం అప్పటి న్యాయవ్వవస్థపై కూడా ప్రభావం చూపింది.

దీంతో ఎమర్జెన్సీ రోజులు తోలగిపోయిన తర్వాత ఆ చీకటి రోజుల్లో దెబ్బతిన్న ప్రజాస్వామ్య ప్రతిష్ఠను పునరుద్ధరించే చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు తొలిసారిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్)ను తీసుకొచ్చింది. పిల్ అంటే తెలుగులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం.

భారతదేశం ప్రజాస్వామ్య దేశం. మనదేశంలో రాజ్యాంగం ప్రకారం పౌరులకు ఇచ్చిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టులు చూసుకుంటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. దీని అర్ధం ఏమిటంటే న్యాయాన్ని ఉచితంగా పొందే హక్కు, గౌరవంగా జీవించే హక్కు, విద్యా హక్కు, పనిచేసే హక్కు, వేధింపుల నుంచి రక్షణ మొదలైనవి.

Meaning of Public Interest Litigation

రాజ్యాంగం ప్రకారం ఉచితంగా న్యాయాన్ని పొందే హక్కునే పిల్‌కు ఉదాహరణ. 1983వ సంవత్సరంలో బంధువా ముక్తి మోర్చా కేసు విచారణ సందర్భంగా బలవంతంగా పనిచేయించడాన్ని వెట్టిచాకిరీ కిందుక వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇక ఏసియాడ్ వర్కర్స్ కేసులో న్యాయమూర్తి పీఎన్ భగవతి కనీస వేతనం కంటే తక్కువ పొందుతున్న వారు ఎవరైనా లేబర్ కమిషనర్, లేబర్ కోర్టులకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టును పిల్ రూపంలో ఆశ్రయించవచ్చని తీర్పును వెలువరించారు.

పిల్ అంటే?

పిల్ అంటే ఏవరో ఒకరి ప్రయోజనాల కోసం కాకుండా ఎక్కువ మంది ప్రజల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించం. సాధారణంగా మనకు ప్రజా ప్రయోజనాలు అంటే ఏంటనే సందేహం కలుగుుతంది.
వెట్టిచాకిరీ, కాలుష్యం, ఉగ్రవాదం, రహదారి భద్రత, పర్యావరణ పరిరక్షణ, మనుషుల అక్రమ రవాణా ఇలా ఒకరి కంటే ఎక్కువ మందికి సంబంధించిన ప్రయోజనాలను కాపాడటమే ప్రజా ప్రయోజనాలని అంటారు.

పిల్‌ను ఎవరు దాఖలు చేయవచ్చు?

భారత పౌరులతో పాటు, స్వచ్చంద సంస్థలు కూడా నేరుగా హైకోర్టు, సుప్రీంకోర్టులో దాఖలు చేయవచ్చు. ఇతర కేసుల్లో మాదిరిగా బాధితులే దాఖలు చేయాలన్న నిబంధన లేదు. దేశంలో 1970ల్లో పిల్ విధానం ప్రారంభం కాగా, 80ల నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చింది.

ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుల్లో పిల్ దాఖలుకు అవకాశం ఉంది. పిల్ దుర్వినియోగం కాకూడదన్న సదుద్దేశంతో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం పిల్‌ను దాఖలు చేయకూడదనే నిబంధన విధించింది.

పిల్ దాఖలు చేసే ముందు ఏయే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి?

పిల్ దాఖలు చేసే ముందు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశంపై పూర్తి స్థాయిలో సమాచారంతో పాటు ఆధారాలను సేకరించాలి. ఓ రికార్డు రూపంలో వాటిని మీ వద్ద ఉంచుకోవాలి. కోర్టులో ఎవరికి వ్యతిరేకంగా పిల్ దాఖలు చేయాలనుకుంటున్నారో, ముందు సంబంధిత సంస్థలకు లీగల్ నోటీసు ఇవ్వాలి.

ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా పిల్ దాఖలు చేయవచ్చు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిల్ దాఖలు చేస్తుంటే అంతకు రెండు నెలల ముందే లీగల్ నోటీసు ఇవ్వాలి. పిల్ దాఖలుకు నామమాత్రపు ఫీజు (ఫిక్స్ డ్ కోర్టు ఫీ) మాత్రమే ఉంటుంది.

సుమోటో కేసు అంటే

ఏదైనా ఒక అంశంపై కోర్టు తనంతట తానే విచారణ చేపట్టడాన్నే సుమోటో కేసుగా పేర్కొంటారు. కోర్టు స్వచ్చందంగా విచారణ చేపడితే అది సుమోటోగా పేర్కొంటారు.

English summary
Meaning of Public Interest Litigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X