• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మక్కా మసీదు పేలుళ్ల తీర్పు: బీజేపీ ఎదురుదాడి, అలా అనలేదని కాంగ్రెస్

By Srinivas
|

హైదరాబాద్: దేశంలో మతకలహాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని తెలంగాణ బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి మంగళారం ఆరోపించారు. మక్కా మసీదు పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. నాటి బాంబు పేలుళ్లను హిందూ తీవ్రవాదంగా, కాషాయ ఉగ్రవాదంగా ముద్ర వేయాలని కాంగ్రెస్ నేతలు చూశారని మండిపడ్డారు.

  నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తుది తీర్పు, భారీ బందోబస్తు

  2014 తర్వాత మాట మార్చారు, రాజకీయ ఒత్తిడి: మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేతపై అసదుద్దీన్

  సోమవారం వెలువడిన కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అన్నారు. దేశ చరిత్రను మంటగలిపే విధంగా నాడు కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు చేసిందన్నారు. కోర్టులో వాదనలు, సాక్ష్యాల ఆధారంగానే తీర్పు చెబుతారు తప్ప, మనుషులను, ప్రాంతాలను చూసి తీర్పు చెప్పరన్నారు. దళితులను ఊచకోత కోసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అన్నారు.

   నాడు జరిగిన వాటికి మన్మోహన్, సోనియా బాధ్యులా?

  నాడు జరిగిన వాటికి మన్మోహన్, సోనియా బాధ్యులా?

  దేశంలో ఎక్కడ అల్లర్లు, ఉగ్రవాద మూకలు చెలరేగినా దాని మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. అఫ్జల్ గురుపై ఇచ్చిన తీర్పు వెనుక మన్మోహన్ సింగ్ ఉన్నారా? కసబ్ తీర్పు వెనుక సోనియా గాంధీ ఉన్నారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీకి న్యాయవ్యవస్థపై, పోలీస్ వ్యవస్థపై గౌరవం లేదన్నారు.

   అప్పుడలా, ఇప్పుడిలానా?

  అప్పుడలా, ఇప్పుడిలానా?

  మక్కా మసీదు పేలుళ్ల కేసులో స్వామి అసిమానంద సహా అయిదుగురు నిందితులకూ విముక్తి లభించడంపై బీజేపీ స్పందించింది. హిందువుల ప్రతిష్ఠను మసకబారుస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్‌ పాల్పడిందని ఈ సందర్భంగా మండిపడింది. కాషాయ ఉగ్రవాదం, హిందూ ఉగ్రవాదం లాంటి పదాలను ఉపయోగించడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీలు క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ఏళ్లుగా హిందువులను కాంగ్రెస్‌ అపఖ్యాతిపాలు చేసే ప్రయత్నాలు చేసిందని, కోర్టు తీర్పుతో ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు బయటపడ్డాయన్నారు. నిందితులకు విముక్తి కల్పించడంలో బీజేపీ పాత్ర ఉందన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీది రెండు నాల్కల ధోరణి అని, 2జీ కుంభకోణంలో నిందితులకు విముక్తి కల్పించినప్పుడు ఆ పార్టీ నేతలు స్వాగతించారని, ఇప్పుడేమో ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు.

  మేం ఎప్పుడూ అలా అనలేదు

  మేం ఎప్పుడూ అలా అనలేదు

  కాషాయ ఉగ్రవాదం అన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఆ పదాన్ని తాము ఎప్పుడు ఉపయోగించలేదన్నారు. ఉగ్రవాదానికి మతం, జాతితో సంబంధం లేదని చెప్పింది. రాహుల్ లేదం కాంగ్రెస్ కాషాయ ఉగ్రవాదం వంటి పదాలు ఉపయోగించలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీఎల్ పూనియా అన్నారు.

  మాకు సంబంధం లేదన్న కాంగ్రెస్

  మాకు సంబంధం లేదన్న కాంగ్రెస్

  విచారణలో ఎన్ఐఏ అనుసరించిన విధానాలపై కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ప్రశ్నలు సంధించారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ నిందితులు వరసగా తప్పించుకుంటున్నారని చెప్పారు. దర్యాప్తు సంస్థలపై ప్రజలకు నమ్మకంపోతోందన్నారు. కాగా, 2013లో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సమయంలో బీజేపీ, ఆరెస్సెస్‌ల గురించి మాట్లాడుతూ హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ షిండే ఉపయోగించారు. దానికి ఆయన పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. 2010లో చిదంబరం కాషాయ ఉగ్రవాదం అన్నారు. ఈ రెండు వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ తెలిపింది.

   స్వామి అసిమానందను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారు

  స్వామి అసిమానందను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారు

  మక్కా మసీదు పేలుళ్ల కేసులో స్వామి అసిమానందతో పాటు మరికొందరిని బలి పశువులను చేయడానికి చేసిన కుట్రలు విఫలమై న్యాయం గెలిచిందని, బాంబు పేలుడు కేసులో అసిమానంద తరఫు లాయర్ రాజవర్ధన్ అన్నారు. సరైన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించడంలో జాతీయ దర్యాప్తు సంస్థ విఫలమైందన్నారు. తీవ్రవాది బిలాల్‌ నేతృత్వంలోని 26 మందితో కూడిన బృందం పేలుడుకు పాల్పడినట్లు గుర్తించారు. బృందంలోని కలీమ్‌ అతని సోదరులు తామే చేశామని అంగీకరించారన్నారు. 2010లో రాజాబాలాజీ ప్రధాన విచారణాధికారిగా వచ్చారని, అంతకు ముందు జరిగిన విచారణను తుంగలోకి తొక్కేసి, కోర్టు ముందుకు రాకుండా జాగ్రత్త పడ్డారని, ఆ తర్వాత అసిమానందతో పాటు వీరిని నిందితులుగా పేర్కొంటూ కేసులు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారని రాజ్‌వర్ధన్‌ అన్నారు. కానీ తప్పు చేయకుండా ఎనిమిదేళ్లు జైల్లో ఉంచారన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Congress came out in defence of Rahul Gandhi and said that he never used the word Hindu terror. The reactions came in the aftermath of an NIA court in Hyderabad acquitting all five accused in the Mecca Masjid blasts case.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more