వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు: ఫిబ్రవరి 24 నుంచే, నాలుగు రోజులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క సారలమ్మ మేడారం చిన్న జాతర(మండల మెలిగే పండగ) తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు చిన్న జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో భాగంగా నిత్యం జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.

జాతరలో మొదటి రోజైన 24న సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల ఆలయాన్ని శుద్ధి చేయడంతోపాటు గ్రామ ద్వార స్తంభాలను స్థాపించనున్నారు. 25న అమ్మవార్లకు పసుపు, కుంకుమతో అర్చన చేస్తారు. ఫిబ్రవరి 26న భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని తెలిపారు.

 medaram chinna jatara from February 24th

సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఫిబ్రవరి 27వ తేదీన జాతర ముగియనుంది. ఈ సంవత్సరం చిన్న మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ కమిటీ, పూజారులు .

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ
చిన్న జాతర తేదీలు ఖరారు కావడంతో సోమవారం నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది. ఈ రెండేళ్ల మధ్య సంవత్సరంలో చిన్న జాతర నిర్వహిస్తారు.

English summary
medaram chinna jatara from February 24th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X