వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్న జాతరొస్తోంది!: వచ్చే నెల 8 నుంచి ప్రారంభం

మేడారం చిన్నజాతర ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

|
Google Oneindia TeluguNews

జయశంకర్‌ భూపాలపల్లి: మళ్లీ వనం జనంతో నిండనుంది... దారులన్నీ రద్దీగా మారనున్నాయి... జంపన్న వాగు భక్తులతో ఉప్పొంగనుంది.. తల్లుల గద్దెలు కిటకిటలాడనున్నాయి.. సమ్మక్క- సారలమ్మ చిన్న జాతరకు గడువు సమీపిస్తోంది. ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు ఉత్సవాన్ని వైభవంగా జరపడానికి సర్కారు సన్నద్ధం అవుతోంది.. మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్‌ మురళి, జాయింట్‌ కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న పనులపై అందిస్తున్న ప్రత్యేక కథనం.

దేవాదాయ శాఖ

ఈ శాఖ ఇప్పటికే మినీ జాతర తేదీలను ఐదు జిల్లాల్లోని అధికారులకు లేఖల రూపంలో పంపింది. ఆలయం పరిసరాలు, భక్తులు విడిది చేసే ప్రదేశాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేస్తోంది. పరిసరాలను శుభ్రం చేస్తోంది. ఇందుకు ములుగు, గోవిందరావుపేట మండలాల నుంచి కూలీలను తీసుకొచ్చింది. రూ. లక్ష వెచ్చించి జంపన్న వాగు దగ్గర కొత్త బోరు వేయించింది. ఆలయం చుట్టు పక్కల చలువ పందిళ్లు వేయనుంది. భక్తులందరికీ ప్రశాంత దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో అశోక్‌ తెలిపారు.

Medaram chinna jatara starts from 8th February

పోలీసు శాఖ

పోలీసు శాఖ మేడారంలో ట్రాఫిక్‌ సమస్యను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతుంది. తాడ్వాయి నుంచి వచ్చే వాహనాల కోసం వై జంక్షన్‌ వద్ద.. పస్రా, భూపాలపల్లి, కాటారం నుంచి వచ్చే వాహనాలకు చిలకలగుట్ట వద్ద పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేసింది. ఇవి రెండు సరిపోకుంటే ఆలయం పక్కనే ఉన్న పోలీసు క్యాంపు స్థలాన్ని పార్కింగ్‌ స్థలంగా ఎంపిక చేసుకోనుంది. 150 మంది పోలీసులు, అధికారులను నియమించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారని, అవసరమైతే ఈ సంఖ్యను రెట్టింపు చేసే వీలుందని ఎస్సై కర్ణాకర్‌రావు తెలిపారు.

గ్రామీణ తాగునీటి సరఫరా

ఈ శాఖ జాతరలో తాగు నీటి కోసం ప్రస్తుతం ఉన్న చేతి పంపులను వినియోగంలోకి తీసుకురానుంది. జాతర జరిగే నాలుగు రోజులు నాలుగు ట్యాంకర్లతో భక్తులు విడిది చేసిన ప్రదేశాలకు నీటిని సరఫరా చేయనుంది. ఆలయం పరిసరాల్లో ఉన్న శాశ్వత మరుగుదొడ్లను బాగు చేయనుంది. గతంలో కంటే ఈ సారి అదనపు సౌకర్యాలు కల్పిస్తామని ఏఈఈ వెంకటసతీష్‌ చెప్పారు.

చిన్న నీటి పారుదలశాఖ

గత మినీ జాతర సందర్భంగా ఈ శాఖ జంపన్న వాగుకు ఇరువైపులా షవర్లు ఏర్పాటు చేసింది. వీటిని భక్తులు బాగా ఆస్వాదించారు. ఈ సారీ అవసరాల మేరకు అదనంగా పెట్టేలా సన్నాహాలు చేస్తోంది. ఇందుకు పెద్దగా ఇబ్బందులు లేవు. సంస్థ గోదాములో ఉన్న షవర్లును తీసుకువచ్చి స్నాన ఘట్టాలపై అమర్చడమే తరువాయి.

ఎన్పీడీసీఎల్‌
ఈ సంస్థ మినీ జాతర ఏర్పాట్లపై ముందుగానే ఓ అంచనాకు వచ్చింది. ఇందుకు గాను మహా జాతర అనంతరం 25 ట్రాన్స్‌ఫార్మర్లను వరంగల్‌కు తరలించకుండా మేడారంలోనే ఉంచింది. వీటి నుంచి భక్తులు విడిది చేసే ప్రాంతాలకు విద్యుత్తు సౌకర్యం కల్పించనుంది. భక్తుల అవసరాల మేరకు సౌకర్యాలు పెంచుతామని సంస్థ ఏడీఈ భాస్కర్‌ వివరించారు.

ఆర్టీసీ
ఆర్టీసీ గతంలో గోవిందరావుపేట మండలం పస్రా నుంచి మాత్రమే బస్సులు నడిపింది. ఈ సారి హైదరాబాద్‌, హన్మకొండల నుంచి ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్నందున, అందుకనుగుణంగా బస్సులను పెంచుతామని వరంగల్‌-2 డిపో మేనేజర్‌ మేనేజర్‌ భాను కిరణ్‌ తెలిపారు.

పంచాయతీ
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పంచాయతీ శాఖ పారిశుద్ధ్య పనులను చేపడుతుంది. ప్రస్తుతం రోజుకు 20 మందితో చెత్తాచెదారాన్ని తొలగిస్తోంది. మినీ జాతర నాటికి మండలంలో ఉన్న పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో కూలీల సంఖ్యను పెంచి పారిశుద్ధ్యలోపం లేకుండా చేస్తామని వూరట్టం పంచాయతీ కార్యదర్శి ఎండీ సుహభానోద్దీన్‌ చెప్పారు.

English summary
Medaram chinna jatara starts from 8th February.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X