వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన మేడారం: తల్లుల వనప్రవేశం, ‘దీవిస్తారని కెసిఆర్’(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

వరంగల్: మేడారం మహాజాతర శనివారంతో ముగిసింది. కోటిన్నర మందికి పైగా భక్తులను కరుణించిన చల్లని తల్లులు.. తమ కోసం తరలివచ్చిన భక్తజనావళిని ఆశీర్వదించి తల్లుల వనప్రవేశంతో మేడారం మహాజాతర ప్రధానఘట్టం పరిపూర్ణమైంది. 4రోజుల పాటు భక్తజన నీరాజనాలు అందుకున్న సమ్మక్క-సారలమ్మ దేవతలు సాయంత్రం వనప్రవేశం చేశారు.

సమ్మక్క...ఆ తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వారి వారి వడ్డె (పూజారు)లు సాంప్రదాయ పూజలు నిర్వహించి వన ప్రవేశం చేయించారు. సమ్మక్క తల్లిని సాయంత్రం 06.18 గంటలకు, సారలమ్మను, గోవిందరాజు, పగిడిద్దరాజులను ఆ వెంటనే గద్దెలను కదిలించారు.

కాగా, అమ్మల వనప్రవేశ ఘట్టం సాయంత్రం వడ్డెల పూజలతో ఆరంభమైంది. గిరిజన పూజారులు డోలు చప్పుళ్ల నడుమ గద్దెపైకి చేరుకుని పూజలు చేసారు. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెపైకి చేరుకుని పూజలు నిర్వహించారు. రహస్య పూజల అనంతరం ప్రతిష్టించిన అమ్మకు ప్రతిరూపమైన కుంకుమ భరిణెను తీసుకుని భక్తులను దాటుకుంటూ గద్దెల ప్రాంగణం నుంచి బయటకు తీసుకువెళ్లి సమ్మక్క తల్లిని వనప్రవేశం చేశారు.

తల్లులు దీవిస్తారు: కెసిఆర్

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సమ్మక్క-సారలమ్మ తల్లులు తప్పక దీవిస్తారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతంగా ముగియడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. లక్షల మంది భక్తులు హాజరైన జాతర కోసం రేయింబవళ్లు పనిచేసిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

మేడారం మహాజాతర శనివారంతో ముగిసింది. కోటిన్నర మందికి పైగా భక్తులను కరుణించిన చల్లని తల్లులు.. తమ కోసం తరలివచ్చిన భక్తజనావళిని ఆశీర్వదించి తల్లుల వనప్రవేశంతో మేడారం మహాజాతర ప్రధానఘట్టం పరిపూర్ణమైంది.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

4రోజుల పాటు భక్తజన నీరాజనాలు అందుకున్న సమ్మక్క-సారలమ్మ దేవతలు సాయంత్రం వనప్రవేశం చేశారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

సమ్మక్క...ఆ తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వారి వారి వడ్డె (పూజారు)లు సాంప్రదాయ పూజలు నిర్వహించి వన ప్రవేశం చేయించారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

సమ్మక్క తల్లిని సాయంత్రం 06.18 గంటలకు, సారలమ్మను, గోవిందరాజు, పగిడిద్దరాజులను ఆ వెంటనే గద్దెలను కదిలించారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

దేవతల వనప్రవేశంతో జాతర ముగిసినట్లు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ప్రకటించారు. సుమారు కోటి 50లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అధికార యంత్రాంగం ధ్రువీకరించారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

కాగా, అమ్మల వనప్రవేశ ఘట్టం సాయంత్రం వడ్డెల పూజలతో ఆరంభమైంది.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

గిరిజన పూజారులు డోలు చప్పుళ్ల నడుమ గద్దెపైకి చేరుకుని పూజలు చేసారు. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెపైకి చేరుకుని పూజలు నిర్వహించారు.

జాతరలో అధికారులు

జాతరలో అధికారులు

జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతం గా నిర్వహించగలిగామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

రహస్య పూజల అనంతరం ప్రతిష్టించిన అమ్మకు ప్రతిరూపమైన కుంకుమ భరిణెను తీసుకుని భక్తులను దాటుకుంటూ గద్దెల ప్రాంగణం నుంచి బయటకు తీసుకువెళ్లి సమ్మక్క తల్లిని వనప్రవేశం చేశారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

పూజారులకు పోలీసు రోప్‌పార్టీలో రక్షణ కల్పించారు. అయినా భక్తులు సమ్మక్క తల్లి వనప్రవేశ సమయంలో పూజారులను తాకేందుకు పోటీలు పడ్డారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు జరుగుతుండగానే సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డెలు గద్దెకు చేరుకున్నారు. అక్కడ గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

గద్దెలపై ఉన్న సారలమ్మ రూపాన్ని కాక సారయ్య నేతృత్వంలో పూజారుల బృందం కన్నెపెల్లికి తీసుకువెళ్లింది.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

గద్దెపై ప్రతిష్టించిన సారలమ్మతల్లి ప్రతిరూపమైన మొంటె (వెదురుబుట్ట)ను తీసుకుని పూజారులు జంపన్నవాగు మీదుగా కన్నెపల్లికి తరలిస్తుంటే భక్తులు పూజారులను తాకేందుకు పోటీపడ్డారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

అంతకుముందు పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజులను ఏటూరునాగారం మండలం కొండాయికి వడ్డెలు సాంప్రదాయ పద్ధతిలో చేర్చారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

శనివారం సమక్క సారలమ్మలను దర్శించుకున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ మేడారం జాతరకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకు వస్తామని తెలిపారు. జాతరకు ఏర్పాట్లను రాష్ట్రప్రభుత్వం బాగా చేపట్టిందన్నారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తల్లుల వనప్రవేశం సమయంలో అశేష భక్తజనావళి హాజరయ్యారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సమ్మక్క-సారలమ్మ తల్లులు తప్పక దీవిస్తారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతంగా ముగియడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

లక్షల మంది భక్తులు హాజరైన జాతర కోసం రేయింబవళ్లు పనిచేసిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

అన్ని శాఖలను సమన్వయపరిచి జాతరను అద్భుతంగా జరిపేందుకు కృషిచేసిన వరంగల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులకు సీఎం అభినందనలు తెలిపారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతం గా నిర్వహించగలిగామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

గతంలో ఎన్నడూలేనివిధంగా సీఎం ముందు గానే రూ.150 కోట్లకుపైగా నిధులు కేటాయించి మంత్రులు, అధికారులను సమన్వయం చేసేందుకు ఆదేశాలు జారీచేశారని ఆయన వివరించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌తోపాటు తామంతా సమన్వయంతో పనిచేశామన్నారు.

English summary
Asia's biggest tribal fair, Sammakka-Saralamma Jatara, concluded on Saturday with lakhs of devotees bidding farewell to the tribal goddesses at Medaram village in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X