• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మేడారం మహాజాతర తేదీలను ప్రకటించిన పూజారులు

|

మేడారం: మేడారం మహాజాతర.. రెండేళ్లకోసారి వచ్చే ఉత్సవం.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. లక్షలాది మంది భక్తజనులు తరలొచ్చే పండుగ.. నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే వనదేవతల సంబురం... విభిన్న సంస్కృతులు.. తీరొక్క మొక్కుల మేళవింపులతో ఆకట్టుకునే మేడారం మహాజాతరకు సుమూహుర్తం ఖరారైంది.

సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణకు పూజారులు తేదీలను నిర్ణయించారు. నూతన జిల్లాలు ఆవిర్భవించిన నేపథ్యంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో తొలి జాతర 2018లో జరుగుతుంది. సరికొత్త ప్రణాళికలతో ... నవ్యోత్సాహంతో ... యువ అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే సకల సన్నాహాలు చేయడానికి నడుం బిగించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు జరిగిన సమ్మక్క,సారలమ్మల చిన్న జాతర జ్ఞాపకాలను భక్తులు మరచిపోకముందే పూజారులు మహాజాతర తేదీలను ప్రకటించారు.

పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ప్రధాన కార్యదర్శి చందా గోపాల్‌రావు, కార్యదర్శి కాక సారయ్య, ప్రధాన పూజారులు ముణీందర్‌, లక్ష్మణ్‌రావు, మహేష్‌, కొక్కెర కృష్ణయ్య, కాక కిరణ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, కనకమ్మ, పూజారులు స్వామి, బోజారావు, నరసింగరావు, సురేందర్‌, లక్ష్మయ్య ఆదివారం గద్దెల ప్రాంగణానికి వచ్చారు. అందరూ కలిసి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు పూజలు నిర్వహించారు.

Medaram jatara on January 31

తర్వాత దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో సమావేశమయ్యారు. జాతర తేదీలను ఖరారు చేశారు. 2018 జనవరి 31(బుధవారం) కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవతను గద్దెలపైకి తీసుకువస్తారు. దీంతో జాతర ప్రారంభమవుతుంది. ఇదే రోజున ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు, మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడం మండలం పూనుగొండ్ల పగిడిద్దరాజును తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.

ఫిబ్రవరి 1(గురువారం)న సమ్మక్క దేవతను చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చి.. గద్దెపై ప్రతిష్ఠిస్తారు.

జాతరలో సమ్మక్కను గద్దెకు తీసుకురావడాన్ని మహాఘట్టంగా పేర్కొంటారు. ఫిబ్రవరి 2(శుక్రవారం)న భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. ఆ రోజును భక్తులు నిండు జాతరగా భావిస్తారు. ఫిబ్రవరి 3(శనివారం) దేవతల వనప్రవేశం జరుగుతుంది. దీంతో జాతర ముగుస్తుంది.

18 రోజులు ముందుగా..

రెండేళ్లకోసారి జరిగే మహాజాతర ఈసారి 18 రోజులు ముందుగా వచ్చింది. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించే ఈ ఉత్సవం 2016లో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరిగింది. 2018లో ఫిబ్రవరి 15 తర్వాత ఉంటుందని అందరూ భావించారు. మాఘశుద్ధ పౌర్ణమి ముందుగా రావడంతో పూజారులు అదే జాతర తేదీలు నిర్ణయించారు.

ఈసారి జాతర ముందుగా రావడం వల్ల భక్తులకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. జనవరి నెలాఖరులో జంపన్నవాగులో సాధారణంగా నీటిప్రవాహం ఉంటుంది. ఎండల తీవ్రత అంతగా ఉంటదు. రైతులకు పంటలు చేతికి వచ్చిన సమయం కావడంతో మేడారానికి అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది.

అధికారులకు పరీక్ష పెట్టిన పూజారులు

గతంలో ఎన్నడూ లేని విధంగా జాతర తేదీలను ముందుగా ప్రకటించిన పూజారులు ఇటు ప్రభుత్వం, అధికారులకు పరీక్షపెట్టారు. గతంలో అక్టోబర్‌లో తేదీలను ప్రకటించేవారు. అధికారులు నవంబర్‌లో సమావేశమై ప్రతిపాదనలు తయారు చేయడం, డిసెంబర్‌లో నిధుల మంజూరు పొందడం, జనవరిలో పనులు ప్రారంభించేవారు.

హడావుడిగా జాతర జరిగే రోజు వరకూ పనులు జరిగేవి. గతానికి భిన్నంగా పూజారులు ఈసారి తొమ్మిది నెలల ముందుగా తేదీలను ప్రకటించారు. దీనివల్ల అధికారులు కూడా ముందుగా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపొచ్చు. ఆమోదం పొంది.. ముందస్తుగా ఏర్పాట్లు చేయవచ్చు. భక్తజనులు మెరుగైన సేవలతో పాటు నూతనత్వాన్ని చవిచూసి వింత అనుభూతిని పొందే అవకాశాలున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
‘Sammakka Saralamma’ Jatara, the largest tribal fair of the nation, will be held from January 31, 2018, to February 3, 2018. The priests of the shrine who met on the temple premises on Sunday announced the schedule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more